యాప్నగరం

గుంటూరు చిన్నారికి అరుదైన నరాల వ్యాధి

గుంటూరుకు చెందిన రెండేళ్ల అరుదైన సైలెంట్ ఏంజెల్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. ఇంతకూ ఆ వ్యాధి లక్షణాలేంటి?

TNN 13 Aug 2017, 3:50 pm
గుంటూరుకు చెందిన రెండేళ్ల చిన్నారి అరుదైన రెట్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. ‘సైలెంట్ ఏంజెల్ సిండ్రోమ్’ అని కూడా పిలిచే ఈ నరాల సంబంధ వ్యాధికి ఇప్పటి వరకు మందు కనుగొనలేదు. ఈ సిండ్రోమ్ ఆడవారికే సోకుతుంది. రెండేళ్ల సాహిత్యను పరీక్షించిన గుంటూరు జనరల్ హాస్పిటల్ వైద్యులు.. వ్యాధిని నిర్ధారించారు. ఇప్పటికైతే దీన్ని నయం చేయలేమని, భవిష్యత్తులో జనటికల్ థెరపీ ద్వారా చికిత్స అందించడం సాధ్యపడొచ్చని తెలిపారు. ఈ సిండ్రోమ్ కారణంగా రెండేళ్ల సాహిత్య సరిగా మాట్లాడలేకపోతోంది. చేతులు మూయడం, తెరవడంలోనూ ఇబ్బంది పడుతోంది. రాష్ట్రంలో ఈ వ్యాధిని గుర్తించడం ఇదే తొలిసారి.
Samayam Telugu guntur baby diagnosed with silent angel syndrome
గుంటూరు చిన్నారికి అరుదైన నరాల వ్యాధి


తొమ్మిది నెలల వరకూ చిన్నారిలో ఏ ఇబ్బంది లేదు. తర్వాతే నిలబడటం, పలకడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో వారు చిన్న పిల్లల డాక్టరు దగ్గరకు పాపను తీసుకెళ్లారు. చేతుల కదలికల్లో తేడా మినహా మిగతా అంతా సరిగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తర్వాత గుంటూరుకు తీసుకురాగా.. అరుదైన రెట్ సిండ్రోమ్‌తో తను బాధపడుతున్నట్లు తేలింది.

ఎక్కువగా అమ్మాయిల్లో మాత్రమే కనిపించే ఈ నరాల సంబంధిత సమస్య రెండేళ్లలోపు వయసులోనే తలెత్తుతుంది. ప్రతి 10,000 - 23,000 కేసుల్లో ఒక్కరికి మాత్రమే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఆటిజం, సెలెబ్రల్ పల్సీ లాంటి లక్షణాలే ఇందులోనూ కనిపిస్తాయి. ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారికి చేతుల కదలికలో ఇబ్బందులు, మెదడు ఎదుగుదల నెమ్మదించడం, కండరాల పనితీరులో సమన్వయలోపం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సిండ్రోమ్ కారణంగా మాట కోల్పోతారు అందుకే దీన్ని సైలెంట్ ఏంజెల్ సిండ్రోమ్ అంటారు.

ఈ వ్యాధికి చికిత్స లేదు గానీ.. తొలి దశలో గుర్తిస్తే కొద్ది మేర ఫలితం ఉంటుంది. ఏడాది నుంచి ఏడాదిన్నర వయసులో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ సిండ్రోమ్ లక్షణాలు..

* మెదడు వృద్ధి నెమ్మదించడం వల్ల సాధారణం కంటే తల పరిమాణం తక్కువగా ఉంటుంది.

* చిన్నారి చేతులను అలాగే రుద్దుతున్నప్పుడు లేదా కడుగుతున్నప్పుడు తేడా గుర్తించొచ్చు.

* మాట్లాడటంలో, సామాజిక నైపుణ్యాల్లో ఆకస్మిక మార్పు, ఆదుర్దాగా కనిపిస్తారు.

* నడకలో ఇబ్బంది, సమన్వయలోపం.

* శ్వాసలో తీసుకోవడంలో ఇబ్బంది. తరచుగా అనారోగ్యం బారిన పడటం, బలవంతంగా శ్వాసను లేదా విడవటం, సొల్లు రావడం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.