యాప్నగరం

బరువు పెరగొద్దా.. మష్రూమ్స్ ఇలా తినండి!

మీరు ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నారా? బరువు పెరగొద్దనేది మీ ఉద్దేశమా. అయితే పుట్టగొడుగులు మీకు చక్కటి ఆహారం.

TNN 22 Oct 2017, 3:28 pm
మీరు బరువు పెరగకుండా నియంత్రణలో ఉండాలని భావిస్తున్నారా? దీనికి పుట్ట గొడుగులు చక్కటి పరిష్కారమట. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా పుట్ట గొడుగులను తీసుకుంటే ఆకలి తక్కువగా వేయడంతోపాటు త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుందట. ఫలితంగా అధికంగా కేలరీలు తీసుకోవడం తగ్గుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. మాంసంతో సమానమైన పోషకాలు పుట్టగొడుగుల్లోనూ ఉంటాయి. కానీ మాంసం బదులు పుట్ట గొడుగులను ఆహారం తీసుకుంటే త్వరగా ఆకలేయదట. జర్నల్ అపెటైట్‌లో ఈ మేరకు ఓ వ్యాసం ప్రచురితమైంది.
Samayam Telugu have mushroom rich breakfast to maintain healthy weight
బరువు పెరగొద్దా.. మష్రూమ్స్ ఇలా తినండి!


మాసంలోనూ, పుట్టగొడుగుల్లోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. కేలరీలు కూడా సమాన స్థాయిలో ఉంటాయి. ఉదయాన్నే వైట్ బటన్ మష్రూమ్స్‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన, తృప్తి కలుగుతాయి. పది రోజులపాటు కొందరికి మాంసాహారం, మరికొందరికి మష్రూమ్స్ ఆహారంగా ఇచ్చారు. వీరిలో పుట్టగొడుగులు తిన్న వారికి ఆకలి తక్కువగా వేసింది. త్వరగా కడుపు నిండిన భావన కలిగింది. మాంసం తిన్నవారి కంటే మష్రూమ్స్ తిన్నవారే సంతృప్తిగా ఫీలయ్యారని సదరు పరిశోధనలో తేలింది. కడుపు నిండిన భావన కలగడం వల్ల అధిక మోతాదులో ఆహారం తీసుకునేందుకు వీలుండదు. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.