యాప్నగరం

తమలపాకు తింటే సంతానలేమి!

​ తమలపాకులకు, భారతీయులకు అవినాభావ సంబంధం ఉంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే, తాంబూల సేవనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

TNN 23 Nov 2017, 6:54 pm
తమలపాకులతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే, తాంబూల సేవనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు ఆకుకూరలు ఎలా మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతే.
Samayam Telugu health benefits of chewing paan or betel leaves
తమలపాకు తింటే సంతానలేమి!


తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల వృద్ధాప్యపు చాయలు కనిపించవు.

ఆక్సీకరణ వల్ల నూనెలు చెడిపోవడాన్ని ‘ర్యాన్సిడిటి’ అంటారు. తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది. నిల్వచేసిన నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకుల వేస్తే సరి.

తమలపాకులోని ‘చెవికాల్’ అనే పదార్థం హానికారక బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుంది. ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఆయిల్ ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

తమలపాకు, సున్నం, వక్క ఈ మూడూ మంచి జోడీ. సున్నం ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం)ను అడ్డుకుంటుంది. తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను అంతర్గత అవయవాల్లోకి చేరిస్తే, వక్క లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది.

రోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దచేసి నీళ్లతో తీసుకుంటే బోధకాలు వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అధిక బరువుతో సతమతమయ్యే వారు రెండు నెలలపాటు రోజూ ఒక తమలపాకు, పది గ్రాముల మిరియాలు కలిపి తిపి, వెంటనే చన్నీళ్లు తాగితే ఫలితం ఉంటుంది.

తలనొప్పితో ఇబ్బంది పడేవారు తమలపాకు రసాన్ని తీసి ముక్కులో వేసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.

తమలపాకులను ముద్దగా నూరి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవాలట.
అంతేకాదు రోజుకు 5 నుంచి 10 తమలపాకులను 2 ఏళ్లపాటు తింటే, డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు.

తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ లాంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్‌కి ముందు స్థితి. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనిని మితంగా వాడుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.