యాప్నగరం

ఏడుపు కూడా ఆరోగ్యమే.. కన్నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలివే!

Health benefits of tears | ఏడుపును ఆపేసుకోవడమంటే.. బాధను మనుసులో స్టోర్ చేసుకున్నట్లే. మనస్సు తెలికై ఆనందంగా ఉండాలంటే వెంటనే ఏడ్చేయండి. దీనివల్ల మానసికంగానే కాదు.. శరీరకంగా కూడా మేలు జరుగుతుంది.

Samayam Telugu 22 Jan 2021, 7:33 pm
రోగ్యం కావాలా? అయితే బాగా ఏడవండి. మనసులో బాధ మొత్తం తొలగిపోయేలా ఏడవండి. ‘‘అదేంటీ.. ఎవరైనా నవ్వుతూ హాయిగా జీవించాలని అంటారు. నవ్వు ఒక భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగమని అంటారు. మీరేంటి ఏడవమని చెబుతున్నారు?’’ అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, మీరు ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాలు గురించి కూడా తెలుసుకోవాలి.
Samayam Telugu Health Benefits Of Crying


ఏడుపు అనేది రెండు విధాలుగా వస్తుంది. ఒకటి బాగా బాధ కలిగినప్పుడు లేదా బాగా ఆనందం కలిగినప్పుడు కళ్ల నుంచి నీళ్లు ఉబికి వచ్చేస్తాయి. ఆ ఏడుపు వల్ల మనకు ఎలాంటి నష్టం కలగదు. పైగా ఆరోగ్యం కూడా లభిస్తుంది. అదెలా అనుకుంటున్నారా?

✺ ఏడవడం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలు బయటకుపోతాయి.
✺ ఏడుపు మానసిక ఆందోళన కూడా దూరం చేస్తుంది.
✺ కన్నీళ్లు మనిషికి రిలాక్స్‌ చేస్తాయట.
✺ ఏడిస్తే మనసు తేలికవుతుంది.
✺ కంటిలోని పొరలను కన్నీళ్లు శుభ్రం చేస్తాయి.
✺ కళ్ళను తడిగా ఉంచడానికి కన్నీళ్లు తోడ్పడతాయి.
✺ బాధను మనస్సులో పెట్టుకుని కుమిలిపోవడం కంటే.. ఏడిస్తేనే మేలు జరుగుతుంది.
✺ ఏడ్చినప్పుడు వచ్చే కన్నీళ్ల ద్వారా మాంగనీసు, పొటాషియం, ప్రొలాక్టిన్ బయటకు వెళ్తాయి.
జలుబు లేదా జ్వరం ఉంటే కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?✺ రక్తం గడ్డ కట్టడానికి, చర్మ వ్యాధులను నయం చేయడానికి, కొవ్వును తగ్గించడానికి కొద్ది మోతాదు మాంగనీసు సరిపోతుంది.
✺ ఏడవడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకుపోతాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
✺ ఏడుపు వల్ల ఎమోషనల్‌, ఫిజికల్‌ బాధలు తగ్గుతాయి.
✺ చాలామంది మనసులో బాధను ఏడుపు బయటకు పంపేసి ఆనందంగా ఉంటారట.
✺ కంటి కార్నియాను తడిగా, శుభ్రంగా ఉంచేందుకు, దుమ్మును, నివారించేందుకు, పోషకాల్ని అందించేందుకు ఏడుపు ఉపయోగపడుతుంది.
✺ కన్నీళ్లలో నీటితోపాటు మ్యుసిన్, లిపిడ్‌ , లైసోజైములు, లాక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబిలిన్‌, గ్లూకోస్, యూరియా, సోడియం, పొటాషియం వంటి పదార్ధాలు ఉంటాయి.
‘నాకు పెళ్లయ్యింది.. కానీ, వేరే అమ్మాయిలతో...’ఓదార్చండి: ఎవరైనా ఏడుస్తుంటే వారిని ఓదార్చండి. ఏడుపు మంచిదే కదా అని వారిని అలా వదిలేయకండి. వారిలో ధైర్యం నింపండి. దీనివల్ల వారు తమకు ఒకరి అండ దొరికిందని సంతోషిస్తారు. దానివల్ల వారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

ఎవరు ఎక్కువ ఏడుస్తారు?: ఆడ, మగ పిల్లలు.. యవ్వనం వచ్చే వరకు సమానంగా ఏడుస్తారు. పెద్ద తేడా ఉండదు. అయితే, టీనేజ్‌లోకి వచ్చేసరికి అబ్బాయిలు తక్కువగా ఏడుస్తారు. టెస్టోస్టెరోన్స్‌ వల్ల అబ్బాయిల్లో ఈ మార్పు కలుగుతుంది. ఇక అమ్మాయిలు.. ఈస్ట్రోజన్‌, ప్రొలాక్టిన్లు వల్ల ఎక్కువగా ఏడుస్తారు. కానీ, బాధ కలిగితే.. ఎవరికైనా ఏడుపు వస్తుంది. ఈ విషయంలో లింగ బేధం ఉండదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.