యాప్నగరం

నిమ్మతో ఆరోగ్యంగా ఉండండిలా!

నిమ్మకాయలో ఉన్న ఔషద లక్షణాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో విటమిన్‌ సి, విటమిన్‌ బి, కాల్షియం, పాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మ కాయలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఆయుర్వేదంతో పాటు పలు రకాల ఔషదాల తయారీకి నిమ్మ పండును వినియోగిస్తుంటారు. అందుకే, నిమ్మను సకల రోగాల నివారణిగా పిలుస్తుంటారు.

TNN 31 Aug 2017, 5:29 pm
నిమ్మకాయలో ఉన్న ఔషద గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో విటమిన్‌ సి, విటమిన్‌ బి, కాల్షియం, పాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మ కాయలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఆయుర్వేదంతో పాటు పలు రకాల ఔషదాల తయారీకి నిమ్మ పండును వినియోగిస్తుంటారు. అందుకే, నిమ్మను సకల రోగాల నివారణిగా పిలుస్తుంటారు.
Samayam Telugu health benefits of lemon no one told you about
నిమ్మతో ఆరోగ్యంగా ఉండండిలా!


★ రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది.
★ నిమ్మ రసంలో తేనె కలుపుకుని తాగితే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి.
★ నోటి పూతకు నిమ్మకాయ మంచి ఔషదం.
★ నిమ్మరసంలోని సిట్రిక్‌ యాసిడ్‌ కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తుంది.
★ జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే కాస్త ఉపశమనం ఉంటుంది.
★ దగ్గు మందుల్లో కఫాన్ని తగ్గించడానికి కూడా కలుపుతారు.
★ నిమ్మ ఆకుల రసానికి తేనె కలిపి ఇస్తే కడుపులో నూలి పురుగులు తగ్గుతాయి.
★ గుండెల్లో మంట, డయేరియా, బద్ధకం నివారణకు నిమ్మరసం మంచి ఔషధం
★ నిమ్మ వల్ల మూత్రంలో సిట్రేట్‌ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవు.
★ చిన్న పిల్లల్లో వచ్చే టాన్సిలైటిస్‌ సమస్యకు చెంచెడు నిమ్మరసాన్ని, చిటికెడు సైంధవ లవణం వేసి తాగిస్తే ఫలితం కనిపిస్తుంది.
★ నిమ్మరసంలో చిటికేడు ఉప్పు, వంటసోడా కలిపి దంతాల మీద రుద్దితే దుర్వాసన పోతుంది.
★ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి నుంచి లభిస్తుంది.
★ నిమ్మతొక్కను సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు.
★ శరీరంలో వాపు, కణాలు దెబ్బతినడానికి కారణమయ్యే కణాలను విటమిన్‌ సి నిర్వీర్యం చేస్తుంది.
★ కొవ్వు తగ్గించడంలో నిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.
★ బ్యాక్టీరియా వల్ల కలిగే దుర్వాసనను నిర్మూలించే లాలాజలాన్ని నిమ్మరసం ఉత్పత్తి చేస్తుంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.