యాప్నగరం

వీర్య కణాల సమస్యకు ఉల్లిపాయ రసంతో చెక్?!!

ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని సామెత ఊరకనే అనలేదు మన పెద్దలు. దీనివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అపారమైనవి.

TNN 3 Dec 2022, 8:55 pm
ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని సామెత ఊరకనే అనలేదు మన పెద్దలు. దీనివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అపారమైనవి. పిల్లలను నిద్రపుచ్చడానికి ఓ చిన్న ఉల్లిపాయని నీళ్లలో వేసి మరిగించాలి. మరిగాక ఉల్లిపాయను బయటకు తీసి ఆ నీటిలో రెండు స్పూన్‌ల పంచదార వేసి పిల్లలతో తాగిస్తే వారు హాయిగా నిద్రపోతారట.
Samayam Telugu onion



చిన్న పిల్లలు ఎక్కువగా టాన్సిల్ వ్యాధితో సతమతమవుతారు. ఇలాంటి వారికి ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని పేస్ట్ చేసి దానికి కాస్త ఉప్పు చేర్చి తినిపించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిని వారితో తాగిస్తే వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందట.

పిల్లలో ఎక్కువ మంది చెవి నొప్పితో బాధపడుతుంటారు. ఈ చిన్నారులకు ఉల్లిపాయ రసాన్ని తీసి వేడిచేసి చలార్చిన తర్వాత చెవిలో వేస్తే నొప్పి ఇట్టే మాయమైపోతుంది. అజీర్తి వల్ల వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడేవారికి ఉల్లిపాయ రసాన్ని తాగించాలి. అరకప్పు ఉల్లిరసాకి గోరువెచ్చని నీటిని కలిపి కొంచెం కొంచెం తాగిస్తే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడతాయి.

ముక్కు నుంచి రక్తం కారుతున్న వారికి ఉల్లిపాయను ముక్కలు చేసి వాసన చూస్తే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కేవలం ఉల్లిపాయ రసం లేదా ఉల్లిపాయ రసానికి మంచినూనె సమపాళ్లలో కలిపి పిప్పిపళ్లు ఉన్న చోట రాస్తే అందులోని పురుగు చచ్చిపోవడమే కాదు నొప్పి కూడా తగ్గుతుంది. అరకప్పు ఉల్లిపాయ రసానికి టీ స్పూన్ తేనె చేర్చి ఉదయం, సాయంత్రం రెండు పూటలా 25 రోజుల పాటు సేవిస్తే పురుషుల్లో వీర్య కణాలు బాగా వృద్ధి చెందుతాయట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.