యాప్నగరం

Heart Attack Symptoms: హార్ట్ అటాక్ లక్షణాలివే..! గుండెను దెబ్బతీసే అలవాట్లివే!

గుండె పోటుకు దారి తీస్తున్న అలవాట్లేవి? హార్ట్ అటాక్ లక్షణాలు ఎలా ఉంటాయి? హార్ట్ అటాక్ ముప్పును ముందుగానే ఎలా గుర్తించవచ్చు? వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

Samayam Telugu 29 Sep 2018, 8:57 am
ఒకప్పుడు గుండె జబ్బులు 50 ఏళ్లు దాటిన వారికి వచ్చేవి. కానీ విపరీతమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రస్తుతం 30 ఏళ్ల వయసులోనే హృద్రోగాల బారిన పడుతున్నారు. గుండె జబ్బుల ముప్పు నానాటికీ అధికం అవుతోంది. దీంతో గుండె ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే జరుపుకొంటున్నాం. గుండెకు సంబంధించిన పరీక్షలు చేసుకోవడానికి, హృదయ సంబంధ వ్యాధుల గురించి అవగాహన పెంపొందడానికి ఇది ఉపయోగపడుతుంది.
Samayam Telugu heart attack6


ఎక్కువ మంది భారతీయుల్ని బలి తీసుకుంటున్న జబ్బుల్లో హార్ట్ అటాక్ ముందు వరుసలో ఉంటుంది. గత 15 ఏళ్లలో గుండె పోటు కారణంగా మరణించిన భారతీయుల సంఖ్య 34 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

హార్ట్ అటాక్ లక్షణాలు:
గుండె పోటు రావడానికి ముందు ఛాతిలో మెల్లగా నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఛాతి మధ్య భాగంలో నొప్పి ఉంటుంది. కొద్ది నిమిషాలపాటు నొప్పి కొనసాగుతూ వచ్చిపోతుంటే.. హార్ట్ అటాక్‌గా అనుమానించాలి. గుండె పోటు వచ్చే ముందు మెడ, దవడ, చేతులు, నడుం, పొట్ట భాగాల్లో అసౌకర్యంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. వాంతి వచ్చినట్టు ఉండటం, వికారం, మైకం, చెమట పట్టడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.

గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం, ధమనుల గోడలు గట్టిపడటం తదితర కారణాల వల్ల గుండె పోటు వస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండెపోటు ముప్పు ఎక్కువ. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నా, హైబీపీ, డయాబెటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నా.. గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువ.

పొగ తాగడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఒబేసిటీ, ఎక్సర్‌సైజ్ చేయకపోవడం, ఆహారం, ఆల్కహాల్ తీసుకోవడం, ఒత్తిడి తదితర కారణాలు గుండె పోటు రావడానికి దోహదం చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.