యాప్నగరం

ఆరోగ్య సూత్రం: రోజూ ఒకే టైమ్‌కి నిద్రపోతున్నారా.. ఎంత సేపు?

రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జీవక్రియ సరిగ్గా ఉండి, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట.

Samayam Telugu 12 Oct 2018, 4:11 pm
మనిషి ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర కూడా ఒక కారణం. ఎంత బాగా నిద్రపోతే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. అలా అని మరీ ఎక్కువగా పడుకున్నా చేటే. రాత్రిళ్లు వీలైనంత త్వరగా పడుకోవాలి. ఉదయం త్వరగా మేల్కోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జీవక్రియ సరిగ్గా ఉండి, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట.
Samayam Telugu 18888-5fca8cf70c15e4901874bb132e5c9445


చాలామందిలో సమయానికి నిద్రపోకపోవడం వల్లే మధుమేహం, బీపీ, హృద్రోగాలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒకే సమయంలో పడుకుని లేచేవాళ్లతో పోలిస్తే నిర్దిష్ట నిద్రా సమయం పాటించని వాళ్లలో మధుమేహం, ఊబకాయం, బీపీ, హృద్రోగ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి ఆహారం, నిద్ర వంటి వాటిలో
కొలతల్నీ వేళల్నీ పాటించడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇంతకీ మనం రోజులో ఎంత సేపు పడుకోవాలి..? పిల్లలకి, పెద్దలకి పడుకునే వేళల్లో ఏమైనా తేడాలుంటాయా..? ఇప్పుడు చూద్దాం..
✦ అప్పుడే పుట్టిన పాపాయి దగ్గర నుంచి మూడు నెలల పిల్లల వరకు రోజుకి 14 నుంచి 17 గంటల నిద్ర అవసరం.
✦ నాలుగు నెలల నుంచి 11 నెలల మధ్య వయసున్న పిల్లలు కనీసం రోజుకి 12 నుంచి 15 గంటలు నిద్రపోవాలి.
✦ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వయసున్న పిల్లలు రోజుకి 11 నుంచి 14 గంటల నిద్రపోతే యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంటారు.
✦ 3 నుంచి 5 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం.
✦ స్కూలుకు వెళ్లే 6 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు రోజుకి 9 నుంచి 11 గంటలు నిద్రపోవాలి.
✦ 14 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న టీనేజర్లు రోజులో 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి.
✦ 18 నుంచి 64 సంవత్సరాల వయసున్న పెద్దలు 7 నుంచి 9 గంటలు నిద్రపోతే మంచిది.
✦ 65 ఏళ్ల పైబడిన వృద్ధులు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.
✦ ఇలా క్రమం తప్పకుండా ఒకే సమయానికి పడుకోవడం, కనీస సమయం నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.