యాప్నగరం

గురకతో భయపెడుతున్నారా?.. నివారణ ఇలా..

మనం నిద్రపోతున్నప్పుడు మన పక్కన ఉన్నవాళ్లు గురక పెడితే దానంత నరకం మరొకటి ఉండదు. కొన్ని గురకలు విసుగు పుట్టిస్తే.. మరికొన్ని గురకలతో భయం పుడుతుంది.

TNN 11 Jul 2017, 4:45 pm
మనం నిద్రపోతున్నప్పుడు మన పక్కన ఉన్నవాళ్లు గురక పెడితే దానంత నరకం మరొకటి ఉండదు. కొన్ని గురకలు విసుగు పుట్టిస్తే.. మరికొన్ని గురకలతో భయం పుడుతుంది. గురక పెట్టేవారు రాత్రిపూట మూత్రానికి ఎక్కువగా వెళుతుంటారని చెబుతున్నారు నిపుణులు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం, వేళకు సరైన పౌష్టికాహారం తీసుకోవడమే కాకుండా తగినంత నిద్ర కూడా అవసరమే. మరి అలాంటి అమూల్యమైన పక్కవారి నిద్రను మన గురకతో పాడుచేస్తే ఎంత చికాకుగా ఉంటుంది. మరి గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలను పాటిద్దాం.!
Samayam Telugu how to stop snoring best ways to help you
గురకతో భయపెడుతున్నారా?.. నివారణ ఇలా..


తేనె: తేనె గురకను తగ్గిస్తుంది. ఇది శ్వాసనాళంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది. అంతేకాక ఇది గొంతు వాపులను, నొప్పిని తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు తేనె, ఆలివ్ ఆయిల్‌ను అర టీస్పూన్ చొప్పున తీసుకొని రెండింటినీ కలపండి. దీన్ని నిద్రపోయే ముందు తాగండి.

పిప్పర్‌మెంట్ ఆయిల్: రెండు చుక్కల పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను ఒక గ్లాసు నీటిలో బాగా కలపి నిద్రపోయే ముందు నోటిలో వేసుకుని బాగా పుక్కిలించండి. కొద్దిగా పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను చేతులకు రాసుకుని వాసన చూసినా గురక తగ్గుతుంది

నెయ్యి: ఇది మూసుకొనిపోయిన ముక్కు రంధ్రాలను ఫ్రీ చేస్తుంది. దాంతో గురక తగ్గుతుంది.

యాలకుల పొడి: ఒక గ్లాసు వేడి నీటిలో అర టీస్పూన్ యాలకుల పొడి కలిపి నిద్ర పోయే ముందు తాగి పడుకుంటే గురక సమస్య తొలగిపోతుంది.

పుదీనా: పుదీనా నిద్రలేమి సమస్యను, గురకను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ముక్కు దిబ్బడను, గొంతునొప్పిని తగ్గిస్తుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగజేస్తుంది. దీన్ని తైలం రూపంలో గానీ, లేదా గోరువెచ్చని నీళ్లలో పుదీనా ఆకులను నానబెట్టి గానీ తీసుకోవాలి.

పసుపు: పసుపును గోరువెచ్చని పాలలో వేసుకొని తాగడం వల్ల శ్వాసనాళాలను
శుభ్రం చేస్తుంది.

వెల్లుల్లి: సైనస్‌ వల్ల వచ్చే ఇబ్బందులను నివారించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి రసం తాగితే గురకను నివారించవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.