యాప్నగరం

ముక్కు నుంచి రక్తం? అయితే, ఇలా చేయండి!

ఎపిస్టాక్సిస్.. ముక్కులో నుంచి రక్తం కారే సమస్య. ముక్కులో సున్నితంగా ఉండే నాసికా పొరలు డ్రై కావడం వల్ల రక్తం కారుతుంది. ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల కూడా నాసికా పొరలకు గాయమై రక్తం వస్తుంది. ఈ రక్తాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..

TNN 10 Apr 2017, 3:09 pm
ఎపిస్టాక్సిస్.. ముక్కులో నుంచి రక్తం కారే సమస్య. ముక్కులో సున్నితంగా ఉండే నాసికా పోరలు డ్రై కావడం వల్ల రక్తం కారుతుంది. ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల కూడా నాసికా పొరలకు గాయమై రక్తం వస్తుంది. ఈ రక్తాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ రక్తానికి అడ్డుకట్టే ఔషదం మన వంటింట్లోనే ఉంది.
Samayam Telugu how to stop your nose from bleeding
ముక్కు నుంచి రక్తం? అయితే, ఇలా చేయండి!


ఉల్లిపాయలు

ఉల్లికి రక్తాన్ని గడ్డకట్టించే స్వభావం ఉంది. ఉల్లితో విటమిన్-సి లభించడంతోపాటు రక్త కేశ నాళికలను బలోపేతం చేస్తాయి. ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లయితే.. ఉల్లిపాయను కత్తిరించి ఒక ముక్కను ముక్కు వద్ద ఉంచి వాసన చూడండి. ఇలా కొద్ది సేపు చేస్తే రక్తం కారడం ఆగిపోతుంది.

కొత్తిమీర

కొత్తిమీర చల్లదనంతో పాటు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఎలర్జీని నివారించే సహజ సిద్ధమైన ఔషదం కూడా. ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లయితే.. 2-3 చుక్కల కొత్తిమీర రసాన్ని ముక్కులో వేయాలి. దీనివల్ల రక్తం కారడం ఆగడంతోపాటు ఎలర్జీ వల్ల ముక్కు పొరలు పగిలే సమస్యను తగ్గిస్తుంది.

తులసి

నారాల సమస్యను దూరం చేసే ప్రకృతిసిద్ధ ఔషదం ఇది. ఒత్తిడికి గురయ్యే నరాలకు ఉపశమనం కలిగించేందుకు తులసి రసం తోడ్పడుతుంది. ముక్కు నుంచి రక్తం కారితే.. రెండు చుక్కల తులసి రసాన్ని వేయాలి. నిత్యం తులసి ఆకులను నమలడం కూడా మంచిదే.

మరికొన్ని చిట్కాలు
ముక్కు నుంచి రక్తం కారితే.. విటమిన్ -ఇ ఆయిల్‌ను కొద్దిగా దూదిపై వేసి ముక్కు పొరలకు రాయండి. లేదా పెట్రోలియం జెల్లీ కూడా రాయవచ్చు.

మీరు తినే ఆహారంలో రోజూ విటమిన్-సి ఉండేలా చూడండి. దీనివల్ల ముక్కు రంధ్రాలు డ్రై కాకుండా తడిగా ఉంటాయి.

శరీరంలోని రక్త నాళాలను చురుగ్గా ఉంచే జింక్ తదితర పోషకాలు ఉండే వీట్ బ్రెడ్స్, బ్రౌన్ రైస్‌లను ఆహారంగా తీసుకోడం మంచిది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.