యాప్నగరం

అతిగా పడుకుంటున్నారా.. త్వరగా పోతారు!

మనిషి అతిగా నిద్రపోతే ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని తాజా అధ్యయనంలో తేలింది. రోజూ 8 గంటలకు మించి పడుకుంటే త్వరగా చనిపోయే ప్రమాదముందని తేలింది.

Samayam Telugu 4 Jul 2019, 2:27 pm
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 8 గంటల నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతుంటారు. అయితే వయసుని బట్టి మనం నిద్రపోయే సమయం ఆధారపడుతుంది. రోజుకు ఎన్ని గంటలు నిద్ర కావాలనేది.. వయస్సును బట్టి మారుతుంటుంది. శిశువులు 18-20 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలి. స్కూలుకు వెళ్లే పిల్లలకు 9-10 గంటలు నిద్రపోవాలి. 20 ఏళ్ల దాటిన తర్వాత 8గంటల పాటు పడుకోవాలి. వృద్ధులైతే ఆరు గంటల పాటు నిద్రపోతే సరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ లెక్కలన్నీ మనిషి రోజుకి ఎన్ని గంటలు పడుకోవాలని చెప్పేందుకు.
Samayam Telugu sleeping


అయితే చాలామంది ఖాళీగా ఉన్నాం కదా అని ఎక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర తక్కువ కావడం వల్ల కంటే అతిగా నిద్రపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ పరిశోధన ప్రకారం రోజుకు 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవారిలో 30శాతం మంది సగటు జీవితకాలం కంటే ముందే చనిపోతున్నారని వెల్లడైంది.

అంతేకాదు అతిగా నిద్రపోయే వారిలో 49శాతం మందికి గుండె సంబంధి వ్యాధులు వచ్చే ప్రమాదముందని, 56శాతం మంది గుండెపోటు వచ్చే అవకాశముందని అధ్యయనంలో తేలింది. రోజుకు 10 గంటలకు మించి నిద్రపోయే వారికి మరణించే ముప్పు 41శాతం ఉందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.