యాప్నగరం

Raju Srivastav : గుండెనొప్పితో కమెడియన్ మృతి.. జిమ్ ఎక్కువగా చేయడమే కారణమా..

Raju Srivastav : బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవలే గుండెపోటుకి గురైన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. ఆగస్ట్‌లో జిమ్ చేస్తూ గుండెపోటుకి గురైనఆయనని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పట్నుంచి ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. కానీ, తాజాగా సెలబ్రిటీలు మంచి లైఫ్‌స్టైల్ పాటించినా మరణించడం బాధకరమే. అసలు గుండె నొప్పి ఎందుకొస్తుంది.. కారణాలు ఏంటో తెలుసుకోండి.

Produced byరావుల అమల | Samayam Telugu 21 Sep 2022, 1:03 pm

ప్రధానాంశాలు:

  • గుండెనొప్పితో కమెడియన్ శ్రీవాస్తవ్ మృతి
  • అతిగా జిమ్ చేయడమే కారణమా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu raju srivastav
రాజు శ్రీవాస్తవ్
గత కొన్ని రోజులుగా సెలబ్రిటీలు కన్నుమూయడం విషాదకరంగా మారింది. నేడు చాలా మంది గుండె సమస్యలు ఎదుర్కొంటున్నారు. సెలబ్రిటీలు సైతం గుండె సమస్యల కారణంగానే మరణించడం అందరిని విస్మయానికి గురి చేస్తుంది. సాధారణంగా సెలబ్రిటీలు అనగానే లైఫ్‌స్టైల్ మామూలు వ్యక్తులతో పోల్చితే విభిన్నంగా ఉంటుంది.
చాలా మంది జిమ్ చేస్తూ, మంచి లైఫ్ స్టైల్ పాటించిన వారే కన్నుమూస్తున్నారు. రాజు శ్రీ వాస్తవ విషయంలోనూ ఇదే జరిగింది. ఆగస్టులో జిమ్ చేస్తున్న ఆయనకి ఒక్కసారిగా గుండెపోటుకి గురయ్యారు. దీంతో ఒక్కసారి అలెర్ట్ అయిన జిమ్ ట్రైయినర్ శ్రీ వాస్తవని ఢిల్లీ ఎయిమ్స్ తరలించారు. తనని పరిశీలించిన డాక్టర్స్ వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.

నిరంతరం పరీక్షించిన వైద్యులు ఆయని బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయిందని పేర్కొన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత ట్రీట్‌మెంట్‌కి స్పందిస్తున్నారని తెలిపారు. ఈరోజు పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. కాగా ఆయన మృతి పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షడు జేపీ నడ్డాతో పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
Best Oil : ఈ నూనె రాస్తే జుట్టు ఊడడం తగ్గి పెరుగుతుందట..
డాక్టర్స్ ఏమంటున్నారంటే..

కాగా రోజురోజుకి గుండె సమస్యల కారణంతో పెరగడం ప్రతి ఒక్కరినీ భయానికి గురిచేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ గుండె సమస్యలు ప్రాణాలను తీస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • ఒత్తిడి లేని జీవనం
  • యోగా, ధ్యానం చేయడం
  • రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్
  • వర్కౌట్స్
  • నీరు తాగడం
  • మంచి డైట్
  • సరైన నిద్ర
  • జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండడం
  • ఆనందంగా ఉండడం..
ఇలాంటివన్నీ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా సమస్యలు, బాధలు ఉన్నా వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దని ఎప్పటికప్పుడు మనసులోని బాధలను దూరం చేసుకునేలా చూడాలని ఇందుకోసం యోగా, ధ్యానం చాలా వరకూ హెల్ప్ చేస్తాయని.. వాటిని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం చాలా మంచిదని చెబుతున్నారు.

వర్కౌట్ ఎక్కువగా చేయడం వల్ల నష్టాలు



ఓవర్ ఎక్సర్‌సైజ్..

అదే విధంగా మంచిది కదా అని వర్కౌట్స్ కూడా ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల కండరాలు, శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. అది గుండె నరాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. రోజుకి 30 నిమిషాల నుంచి గంట వరకూ చేయొచ్చు. వారంలో మొత్తం 5రోజులు చేసినా చాలని సూచిస్తున్నారు నిపుణులు.

Also Read : Dinner : త్వరగా, హెల్దీగా రెడీ అయ్యే డిన్నర్ రెసిపీస్..

గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News..
రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.