యాప్నగరం

ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లు తినొద్దు.. ఎందుకంటే..

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే రెగ్యులర్‌గా తినాలని చెబుతుంటారు నిపుణులు. ఈ కారణంగా చాలా మంది అందరికీ అందుబాటులో ఉండే అరటిపండ్లు తింటారు. వీటిని ఎలా తినాలో చెబుతున్నారు నిపుణులు.

Samayam Telugu 27 Jan 2020, 10:56 am
అరటి పండ్లు.. అందరికీ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ పండులో పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిని ప్రతి ఒక్కరూ తినొచ్చు. ప్రతి ఒక్కరికీ సులభంగా లభించే ఈ పండ్లల్లో ఎన్నో ఘనమైన విటమిన్లు ఉంటాయి. అయితే, మనం పండ్లని ఫ్రిజ్‌లో పెడతాం. ఎందుకంటే చాలా రోజుల వరకూ తాజాగా ఉంటాయని.. అలానే అరటిపండ్లు కూడా.. మరి ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లని తినొచ్చా లేదా.. ఇప్పుడు చూద్దాం..
Samayam Telugu is it okay to put bananas in the fridge
ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లు తినొద్దు.. ఎందుకంటే..



​అరటిపండులోని పోషకాలు..

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్నిచ్చే అరటిపండ్లు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. అరటిపండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా వరకూ ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.


Also Read : కౌగిలించుకుంటే ఆరోగ్యంగా ఉంటారట..

​గుండెపొటు సమస్యలు దూరం..

అరటిలోని గొప్ప గుణాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.. ఎన్నో కొత్త విషయాలను చెబుతున్నారు. అవును.. గుండె సమస్యలతో బాధపడేవారు అరటిపండుని తినడం మంచిదని చెబుతున్నారు. రోజుకి మూడు అరటిపండ్లు తింటే గుండె సమస్యలు చాలా వరకూ దూరమవుతాయని చెబుతున్నారు.

​తక్షణ శక్తి ఖాయం..

అరటిపండ్లు రెగ్యులర్‌గా తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ప్రత్యేక గుణాల, చక్కెర శాతం ఉండడం వల్ల మనకు రోజంతా ఎనర్జీని ఇస్తాయని చెబుతారు నిపుణులు. అందుకే వర్కౌట్ చేసే వారు ఈ పండ్లని తినడం చాలా మంచిదని చెబుతున్నారు. అరటిపండులో ఐరన్, హిమోగ్లోబిన్ శాతాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల రక్తహీనత సమస్యలు దూరం అవుతాయి. క్రమంగా శారీరక శక్తి స్థాయిలు మెరుగవుతాయి. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా, సోడియం నిక్షేపాలు కూడా ఎక్కువగా ఉంటాయి.


Also Read : మెంతులను ఇలా వాడితే షుగర్ ఇట్టే పోతుంది..

​జీర్ణ సమస్యలు దూరం..

అరటిపండ్లలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం వల్ల చాలా వరకూ జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అందుకే వీటిని రెగ్యులర్‌గా తినాలని చెబుతుంటారు నిపుణులు. జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా మారి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అంతేనా వీటిని తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా సరిగ్గా ఉండి బరువు తగ్గుతారు.

​ఫ్రిజ్‌లో పెట్టొచ్చా..

చాలా రకాల పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అలానే చాలా మంది అరటిపండ్లని కూడా పెడుతుంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

Also Read : వెన్నునొప్పిని తగ్గించే ఎఫెక్టివ్ చిట్కా...

​ఫ్రిజ్‌లో ఎందుకు వద్దు..

అరటి పండ్లని ఫ్రిజ్‌లో పెట్టకూడదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ పండ్లు మగ్గడానికి పొడి వాతావరణం అవసరం. అందుకని వాటిని ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. అంతేకాదు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పండ్లు సరిగా పండవు. అంతేనా.. పై తొక్కు నల్లగా మారిమారిపోయి పండు రుచి తగ్గిపోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.