యాప్నగరం

అదే పనిగా టీవీ చూసే బాలికల్లో ఊబకాయం ముప్పు!

పిల్లల పడకగదిలో టీవీ ఉంటే ముఖ్యంగా బాలికల్లో ఊబకాయం ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో బయటపడింది.

TNN 5 Jun 2017, 1:07 pm
పిల్లల పడకగదిలో టీవీ ఉంటే ముఖ్యంగా బాలికల్లో ఊబకాయం ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో బయటపడింది. ఏడేళ్ల బాలికల పడకగదిలో టీవీ ఉంటే ఊబకాయం ముప్పు 30 శాతం ఎక్కువని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు అధ్యయనంలో తేలింది. పడకగదిలో టెలివిజన్ సౌకర్యం లేని పదకొండేళ్ల పిల్లలతో పోల్చుకుంటే వీరిలో అధిక బరువు ప్రమాదం ఎక్కువని అధ్యయనంలో గుర్తించారు. అదే విధంగా బాలురు పడకగదిలో టీవీ ఉంటే అధిక బరువు ముప్పు 20 శాతం ఎక్కువని తేలింది. పడకగదిలో టెలివిజన్ వల్ల పిల్లల్లో అధికబరువు ముప్పు పెరుగుతున్నట్లు గుర్తించామని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన అంజా హెయిల్‌మన్ పేర్కొన్నారు.
Samayam Telugu kids with tv in their bedroom are at a higher risk of obesity study
అదే పనిగా టీవీ చూసే బాలికల్లో ఊబకాయం ముప్పు!


అధిక బరువుకు కారణం గురించి తెలుసుకోడానికి 12,556 మంది పిల్లలపై అధ్యయనం చేశారు. ఇందులో వారి కుటుంబ ఆదాయం, తల్లి విద్యార్హతలు, శారీరక శ్రమ, శైశవ దశలో తల్లి పాలు తీసుకోవడం లాంటి వాటిని పరిశీలించారు. అంతే కాకుండా తల్లి బాడీ మాస్ ఇండెక్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మదర్స్ బీఎంఐ అనేది ఇంటిలోని ఆహారపు అలవాట్లు, జన్యు సంభావ్యతను ప్రతిబింబిస్తుంది.

మూడేళ్ల వయసులో పిల్లల బీఎంఐ పరిశీలించినప్పుడు టీవీ ముందు ఎక్కువ సమయం గడిపితే అధిక బరువుకు కారణమైనట్లు తేలింది. అంతేకాదు బాలికల్లో బరువు పెరగడానికి, ఎక్కువ సమయం టీవీలు చూడటానికి సంబంధం ఉందని గుర్తించారు. అధిక బరువు, ఊబకాయం చాలా క్లిష్టమైనవి. వీటికి ఎక్కువ సమయం టెలివిజన్ ముందు గడపడం కూడా పెద్ద కారణం.... కౌమారులు, యుక్త వయసు వారిలో పెరుగుతోన్న కంప్యూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్ వినియోగంపై త్వరలో అధ్యయనం చేపట్టనున్నట్లు హెయిల్‌మాన్ తెలియజేశారు. ఈ పరిశోధన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీలో ప్రచురించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.