యాప్నగరం

సెక్స్‌స్నోమియా.. నిద్రలోనే సెక్స్ చేసే రుగ్మత!

నిద్రలో నడవడం గురించి విన్నారు కానీ.. నిద్రలోనే శృంగారంలో పాల్గొనడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజమే.

TNN 24 Oct 2017, 8:18 pm
నిద్రలో నడవడం గురించి విన్నారు కానీ.. నిద్రలోనే శృంగారంలో పాల్గొనడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజమే. సెక్స్‌స్నోమియా అనే రుగ్మత వచ్చిన వారు ఇలాగే నిద్రలో సెక్స్ చేస్తారట. కానీ ఈ రుగ్మతను కారణంగా చూపి లైంగిక దాడి చేస్తే అని మాత్రం అడగకండి. ఇలాంటి ఘటనే ఇప్పుడు న్యాయస్థానంలో విచారణలో ఉంది.
Samayam Telugu man who assaulted woman 200 times claims he is suffering from sexsomnia
సెక్స్‌స్నోమియా.. నిద్రలోనే సెక్స్ చేసే రుగ్మత!


లారెన్స్ బారిల్లీ అనే ప్రబుద్ధుడు ఒక మహిళపై 200సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో తన శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. కానీ తాను కావాలని ఇలా చేయలేదంటున్నాడు. సెక్స్‌సోమ్నియా అనే రుగ్మత కారణంగా తనకు తెలియకుండానే నిద్రలో ఇలా చేశానని చెబుతున్నాడు. 35 ఏళ్ల లారెన్స్ బారిల్లీ అనే వ్యక్తి 2011 సెప్టెంబర్ నుంచి మరుసటి ఏడాది అక్టోబర్ వరకు ఓ మహిళపై పలు సందర్భాల్లో ఇలా శృంగారంలో పాల్గొన్నాడు.

ఆమె అతణ్ని ప్రతిఘటించగా.. నిద్రలో తనకు తెలియకుండానే ఇలా చేస్తున్నానని చెప్పాడు. లారెన్స్‌తో బ్రేకప్ అయిన చాలా ఏళ్ల తర్వాత ఆమె అతణ్ని కలిసింది. అప్పుడు లారెన్స్ ఆమెతో ఇలా చేయడంతో.. తిరిగి తనతో అనుబంధాన్ని కోరుకుంటున్నాడని భావించింది. నువ్వు చేసే పని నాకు నచ్చడం లేదని చెప్పగా.. సెక్స్‌సోమ్నియా కారణంగానే తానిలా చేశానని సింపుల్‌గా చెప్పాడు. 2008 నుంచి 2010 మధ్య మరో మహిళను కూడా రేప్ చేశాడని బారిల్లీ మీద ఆరోపణలు ఉన్నాయి.

సెక్స్‌సోమ్నియా డిజార్డర్ ఉన్నవారు నిద్రలోనే లైంగిక చర్యకు ఉపక్రమిస్తారని థెరపిస్టులు చెబుతున్నారు. ఈ రుగ్మతతో బాధపడేవారు రాత్రి నిద్రలో సెక్స్ చేసినప్పటికీ.. మరుసటి రోజు ఉదయం వారికి ఆ సంగతి గుర్తు ఉండదట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.