యాప్నగరం

మొబైల్ ఫోన్లతో క్యాన్సర్ ముప్పు!

మొబైల్ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. లండన్‌కు చెందిన 'ఫిజిషియన్స్ హెల్త్ ఇనీషియేటివ్ ఫర్ రేడియేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్' శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.

Samayam Telugu 12 May 2018, 12:10 am
మొబైల్ ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. లండన్‌కు చెందిన 'ఫిజిషియన్స్ హెల్త్ ఇనీషియేటివ్ ఫర్ రేడియేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్' శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సరే కాదు.. మొబైల్ ఫోన్లను అధికంగా వాడటం వల్ల చెవుడు, జ్ఞాపకశక్తి లోపించడం, నరాల బలహీనతలాంటి సమస్యలు కూడా వస్తున్నట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వాడకంతోపాటు బ్రెయిట్ ట్యూమర్లలో ఒకటైన 'గ్లియోబ్లాస్టోమా మల్టీఫోర్మ్' స్థాయిలు విపరీతంగా పెరిగిపోతున్నట్లు వారు గుర్తించారు.
Samayam Telugu cancer


ఇప్పటికైనా.. మొబైల్ ఫోన్ల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ల్యాండ్‌లైన్లు వాడటమో లేదా కనీసం హెడ్‌ఫోన్స్ వాడటం అలవాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్‌ను వీలైనంత వరకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లల మెదడు చాలా సున్నితంగా ఉంటుందని.. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల వారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు ఫోన్లను దూరంగా ఉంచాలని సలహా ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.