యాప్నగరం

మానవుల ఆయుష్షుకు అంతంలేదట!

మానవుల ఆయు: ప్రమాణం గరిష్ఠంగా 115 ఏళ్లు అని అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు గతేడాది తెలిపిన విషయాన్ని కెనడా శాస్త్రవేత్తలు అది తప్పని అంటారు

TNN 29 Jun 2017, 2:57 pm
మానవుల ఆయు: ప్రమాణం గరిష్ఠంగా 115 ఏళ్లు అని అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు గతేడాది తెలిపిన విషయాన్ని కెనడా శాస్త్రవేత్తలు అది తప్పని అంటారు. మానవుడు ఆయువుకు అంతం లేదని కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై సవాల్ విసురుతున్నారు. మన ఆయుష్షుకు పరిమితి లేదని, కాబట్టి ఈ పరిమితులను గుర్తించలేమని మెక్‌గిల్ యూనివర్సిటీ జీవశాస్త్రవేత్త సెగ్‌ఫ్రైడ్ హెక్మీ పేర్కొన్నారు. మానవ జీవితాన్ని అనుసరించి, సగటు ఆయు:ప్రమాణం పెరుగుతున్నట్లు తెలియజేస్తుందని, దీనిని నిలుపుదల చేయడానికి అవసరమైన జీవకారక గణాంకాలు లేవని తెలిపారు.
Samayam Telugu no limit to how long people can live study
మానవుల ఆయుష్షుకు అంతంలేదట!


సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటివ్ నివేదిక ప్రకారం శతాబ్దం కిందట అంటే 1900 నాటికి సగటు ఆయు: ప్రమాణం 47 ఏళ్లుంటే, 1970 నాటికి 71 ఏళ్లకు చేరుకుంది. 2015 నాటికి ఇది ఏటా పెరుగుతూ ఉందని, కానీ రెండు దశాబ్దాల్లో తొలిసారిగా 78.8 కి తగ్గింది. 19 వ శతాబ్దం నుంచి మానవుల సగటు ఆయు: ప్రమాణం పెరిగినట్లు ఐన్‌స్టీన్ కాలేజ్‌ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన జాన్ విజింగ్ గతేడాది ప్రకటించారు. అలాగే జనాభా, మరణాలు వివరాలు ఆధారంగా కనీసం 100 ఏళ్ల కంటే ఎక్కువ జీవించలేరని అన్నారు. కొందరు 100 ఏళ్ల వరకు జీవిస్తారు. 1970 నుంచి సగటు ఆయుష్షు పెరిగినా 1990 వ దశకం మధ్యలో మందగించిందని తెలియజేశారు.

అయితే కొందరు 115 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించారని, ఫ్రాన్స్‌కు చెందిన జియాన్నే కాల్మెంట్ 122 ఏళ్ల వయసు వరకు జీవించి 1997లో మరణించాడు. అలాగే ప్రపంచంలో అత్యంత వయసున్న వ్యక్తిగా పేరుపొందిన ఇటలీకి చెందిన ఎమ్మా మొరానో 117 ఏళ్లు జీవించాడు. ఎక్కువ కాలం జీవిస్తున్నందు వల్ల ఆయువుకు అంతం లేదనడం సరికాదని విజింగ్ అన్నారు. సంక్రమిత, దీర్ఘకాలిక వ్యాధులకు వ్యతిరేకంగా సాధించిన పురోగతి సగటు జీవన కాలాన్ని పెంచినా, కానీ గరిష్ట జీవితకాలం మాత్రం పెరగదని అన్నారు. అయితే ఈ నివేదికతో హెక్మీ, అతడి సహచరుడు జీవశాస్త్రజ్ఞుడు బ్రయాన్ హ్యూగ్స్ ఏకీభవించడం లేదు.

వారు విశ్లేషించిన డేటా ఆధారంగా ఆయువు తగ్గినట్లు తాము నిరూపిస్తామని, ఈ ఛాలెంజ్‌కు ఐన్‌స్టీన్ పరిశోధకులు నిలబడతారా అని ప్రశ్నించారు. అంతే కాదు వారు పేర్కొంటున్నట్లు సగటు ఆయువులో ఎలాంటి మందగమనం లేదని అన్నారు. మానవుడు తనకు నచ్చినంతవరకు జీవించవచ్చనని బలంగా నమ్ముతున్నానని హెక్మీ వ్యాఖ్యానించారు. ఒక శాస్త్రవేత్తగా ఈ విషయాలు నేను రుజువు చేయలేకపోయినా, మనసులో బలంగా ఉందని తెలిపారు.

అలాగే భవిష్యత్తు తరాల మన కన్నా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని, ప్రస్తుత కాలం ప్రజలు దీన్ని అర్ధం చేసుకోవడం సాధ్యం కాదని తెలియజేశారు. మూడు వందల ఏళ్ల కిందట మానవుల ఆయుష్షు చాలా తక్కువ. భవిష్యత్తుల్లో 100 ఏళ్లు జీవిస్తారని అప్పటి వ్యక్తులు చెబితే వారిని పిచ్చివారిగా భావించి ఉంటారని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.