యాప్నగరం

Heart Attack Factors: గుండెపోటు రావడానికి.. 6 ప్రధాన కారణాలు ఇవే..!

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 14 Jul 2023, 2:42 pm
​Heart Attack Factors: ప్రస్తుతం సంబంధం లేకుండా చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. గుండె జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. . దేశంలో ఏటా మూడు మిలియన్ల మంది గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. WHO ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. ఈ మధ్య కాలంలో చిన్నవయస్సువారిలోనూ గుండె పోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్‌ బాత్రా.. హార్ట్‌ ఎటాక్‌ ముప్పును పెంచే.. 6 అంశాల గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వివరించారు.
Samayam Telugu nutritionist lovneet batra explined main factors of heart attack
Heart Attack Factors: గుండెపోటు రావడానికి.. 6 ప్రధాన కారణాలు ఇవే..!


హార్ట్‌ ఎటాక్‌ కారణాలు..

View this post on Instagram A post shared by Nutrition.by.Lovneet (@nutrition.by.lovneet)

స్మోకింగ్‌..

స్మోకింగ్‌ చేసేవారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్, పొగాకు, బీడీ పొగలోని రసాయనాలు రక్తాన్ని చిక్కగా చేసి.. సిరలు, ధమనుల లోపల గడ్డలు ఏర్పరుస్తాయి. సిరలు, ధమనుల గడ్డకట్టడం, అడ్డంకలు ఏర్పడటం వల్ల గుండెపోటు, ఆకస్మిక మరణానికి దారి తీస్తుంది. పొగాకు మూలంగా రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరుగుతాయి. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని పొగతాగే అలవాటుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అధిక రక్తపోటు..

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచే.. ఆహారాలు ఇవే..!

హైపర్‌టెన్షన్‌ కారణంగా హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశం ఉందని లవ్‌నీత్‌ బాత్రా అంటున్నారు. అధిక రక్తపోటు .. ధమనుల సాగే గుణం తగ్గిస్తుంది, వాటిని దెబ్బతీస్తుంది. ఇలా గుండెకు ఆక్సిజన్‌, రక్తం ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటుకు దారితీస్తుంది.

Also Read:

యుక్త వయసులో గుండె సమస్యలు రావడానికి కారణాలు

డయాబెటిస్‌..

దీర్ఘకాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే.. రక్తనాళాలు, నరాలు దెబ్బతింటాయి. గుండెకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకోవడమే కాకుండా ఆక్సిజన్‌, పోషకాల సరఫరా నెమ్మదిగా జరుగుతుంది. దీని కారణంగా గుండె పనితీరు మందగించి.. గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది.

అధిక కొలెస్ట్రాల్‌..

మన శరీరంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా పేరుకుపోతే.. గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల గుండెకు, వెళ్లే ధమనులలో అవరోధం ఏర్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడి.. గుండె పోటుకు దారితీస్తుంది.

Also Read: గుండె కండరాలు వీక్‌గా ఉంటే.. ఈ లక్షణాలు కనిపిస్తాయ్‌..!

శారీరక శ్రమ లేకపోవడం..

కరోనరీ హార్ట్ డిసీజ్ మరణాలలో సుమారు 35% శారీరక శ్రమ లేకపోవడం వల్లే సంభవిస్తున్నాయని ఓ నివేదిక స్పష్టం చేసింది. డిజిటల్‌ యుగంలో గంటల గంటలు క్యంపూటర్‌, ఫోన్‌ మందు సమయం గడుతున్నారు కానీ.. శారీర శ్రమకు ఇంపార్టెన్స్‌ ఇవ్వడం లేదు. మనం ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం ఒక్కటే సరిపోదు.. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండటమూ అంతే ముఖ్యం. మీ గూండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం, వాకింగ్‌, కార్డియో ఎక్స్‌అర్‌సైజ్‌లు చేయండి.

అధిక బరువు..

అధిక బరువు గుండెకూ చేటే. బరువు పెరగటం వల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. అధిక బరువు కారణంగా ధమనుల్లో కొవ్వు ప్రదార్థాలు పేరుకుపోతాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు దెబ్బతిన్నట్లయితే గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి ఆహార, వ్యాయామాలతో బరువు పెరగకుండా చూసుకోవాలి.

Also Read: ఈ జాగ్రత్తలు పాటిస్తే .. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.