యాప్నగరం

మతిమరుపు, ఊబకాయానికి చెక్ పెట్టాలంటే.....

ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో ఎవరూ శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏ మాత్రం ఖాళీ దొరికితే చాలు ఫోన్లో వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌తో అనుసంధానమవుతున్నారు.

TNN 3 Dec 2022, 8:58 pm
గంటల కొద్దీ స్మార్ట్ ‌ఫోన్లో వాట్సాప్, ఫేస్‌బుక్ చాటింగులకు అలవాటు పడి సమయం ఉన్నా ఆరోగ్యం గురించి నేటి యువతకు ఏ మాత్రం శ్రద్ధ లేకుంగా పోతోంది. ఏ కొద్ది సమయం దొరికినా కంప్యూటర్ ముందు కాలం వెల్లదీస్తున్నారు తప్ప వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లకు అలవాటు పడి కదలకుండా ఉంటే ఊబకాయం తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు.
Samayam Telugu exercise


ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనంలో వ్యాయామానికి తీరిక దొరకట్లేదు. ఒక వేళ ఉన్నా శారీరక శ్రమతో కూడిన పనుల్ని చేయడానికి ఇష్టపడట్లేదు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ లేని కారణంగా ఊబకాయం బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 5.3 మిలియన్ల మంది మరణించినట్లు తాజా అధ్యయనంలో తేలింది.

శారీరక శ్రమ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించే వారిలో ఒబిసిటీతో పాటు మతిమరుపు సమస్యలు దూరమైనట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగంగా చేసుకుంటే మతిమరుపు దరిచేరదు సరికదా చురుకుగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు సైతం దూరమవుతాయని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.