యాప్నగరం

వాల్‌నట్స్‌తో.. పేగులు శుద్ధి!

ఇంతవరకు వాల్‌నట్స్ తిననివారు.. తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే.. పేగుల్లోని సూక్ష్మజీవుల వ్యవస్థ స్వభావాన్ని సమూలంగా సమూలంగా మార్చి, ఆరోగ్యాన్ని చేకూర్చే అద్భుతశక్తి వాల్‌నట్స్‌కు ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది.

Samayam Telugu 31 May 2018, 5:15 pm
ఇంతవరకు వాల్‌నట్స్ తిననివారు.. తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే.. పేగుల్లోని సూక్ష్మజీవుల వ్యవస్థ స్వభావాన్ని సమూలంగా మార్చి, ఆరోగ్యాన్ని చేకూర్చే అద్భుతశక్తి వాల్‌నట్స్‌కు ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. లూసియానాలోని ‘ఎల్‌ఎస్‌యూ హెల్త్‌ న్యూ ఓర్లీన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’కు చెందిన లూరీ బాయిలీ బృందం చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. ఈ పరిశోధన కోసం.. వీరు కొంతమందికి ఆహారంలో భాగంగా కొద్దిరోజుల పాటు వాల్‌నట్స్‌ను అందించింది. మరికొందరికి సాధారణ ఆహారమే ఇచ్చింది.
Samayam Telugu walnuts


కొన్నొరోజుల తర్వాత వారి పేగుల్లోని బ్యాక్టీరియాను విశ్లేషించగా, వాల్‌నట్స్‌ తీసుకున్నవారిలో చాలా మార్పు కనిపించింది. వారి పేగులు శుద్ధయి, హితకర సూక్ష్మజీవుల సంఖ్య పెరగడమే కాకుండా, వాటి వ్యవస్థ కూడా బలోపేతమైనట్లు గుర్తించారు. వాల్‌నట్స్‌లో ఉండే ‘ప్రీ బయోటిక్స్‌’ అనే పోషకం ప్రత్యేకంగా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడటమే ఇందుకు కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే రోజువారీ ఆహారంలో భాగంగా వాల్‌నట్స్‌ను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.