యాప్నగరం

How to take honey: తేనె ఇలా తీసుకుంటే.. విషంగా మారుతుంది జాగ్రత్త..!

తేనెను కొన్ని విధాలుగా తీసుకుంటే విషంగా మారే ప్రమాదం ఉందని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సద్గురు అన్నారు. తేనెను ఏ విధంగా తీసుకోవాలో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షేర్‌ చేశారు.

Edited byరాజీవ్ శరణ్య | Samayam Telugu 7 Jul 2022, 12:45 pm
తేనె, ప్రతి ఒకరి వంటగదిలో కామన్‌గా ఉంటుంది. చాలామందికి ఉదయం లేవగానే తేనె, నిమ్మరసం వేసిన నీళ్లు తాగడం అలవాటుగా ఉంటుంది. తేనెలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. తేనె రోజూ తీసుకుంటే.. రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. తేనెలో క్యాల్షియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, పొటాషియం వంటి మినరల్స్‌‌తో పాటు, విటమిన్‌ సి, విటమిన్‌ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. తేనె తీసుకుంటే..శ్వాస సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. ఎన్నో పోషకాలు ఉన్న తేనెను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Samayam Telugu honey


అయితే.. తేనెను కొన్ని విధాలుగా తీసుకుంటే.. విషంగా మారే ప్రమాదం ఉందని.. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సద్గురు అన్నారు. ఈ విషయంపై సద్గురు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. తేన మన శరీర వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుందని సద్గురు అన్నారు. తేనెను ఒక నిర్దిష్ట పద్ధతిలో తీసుకుంటే.. విషంగా మారే అవకాశం ఉందని అన్నారు.
View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru)

ఇలా తీసుకోవద్దు..
తేనెను వివిధ మార్గాల్లో తీసుకుంటారని, తేనె కూడా శరీరంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని సద్గురు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో అన్నారు. కేవలం తేన మాత్రమే తీసుకుంటే ఒకలా, వేడి నీటితో, చల్లని నీటితో తీసుకుంటే.. వేరే విధంగా శరీరంపై ప్రభావం చూపుతుందని అన్నారు. గోరువెచ్చని నీటితో తేన తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తేనెను వేడినీటిలో వేస్తే విషంగా మారుతుందని, అందువల్ల దానిని వేడినీటిలో, మరిగేనీటిలో వేయకూడదని అన్నారు.
తేనెను వండాల్సిన అవసరం లేదని. ఫారిన్‌ దేశాల్లోలో హనీ కేక్స్‌ తయారు చేస్తారని అన్నారు తేనెను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వండితే.. వెంటనే విషం కిందమారే ప్రమాదం ఉందని అన్నారు.
ఎలా తీసుకోవాలి..


తేనెను అలానే తినడం ఉత్తమ మార్గం అని నిపుణులు చెబుతున్నట్లు.. సద్గురు అన్నారు. మీరు పాలలో, నీటిలో వేసుకుని తాగాలనుకుంటే.. అవి పూర్తిగా చల్లారిన తర్వాత తాగితే మంచిదని చెప్పారు.
ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి చేయడం లేదా ఉడికించడం వంటివి చేయకూడదు. 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల కెమికల్‌ మార్పులు జరుగుతాయి. వేడి తేనె తాగడం వల్ల విషపూరిత అణువులు జీర్ణ వ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకుని అమా అనే టాక్సిన్ గా మారుతాయి. దీనివల్ల కడుపునొప్పి కలగవచ్చు. శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరుగడం వంటివి జరుగుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.