యాప్నగరం

నిద్రలేమితో ఈ ప్రొటీన్ స్థాయిలు పెరిగితే....

గాఢ నిద్రకు భంగం కలిగినపుడు అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే ఎమలాయిడ్ బీటా, టీ ప్రొటీన్‌లు మెదడు, వెన్నుపాములోని మేరు ద్రవంలో ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడయ్యింది.

TNN 12 Jul 2017, 2:32 pm
గాఢ నిద్రకు భంగం కలిగినపుడు అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే ఎమలాయిడ్ బీటా, టీ ప్రొటీన్‌లు మెదడు, వెన్నుపాములోని మేరు ద్రవంలో ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. దీర్ఘకాలంపాటు నిద్రలేమి సమస్య వల్ల సెరెబ్రోస్పానియల్ ద్రవంలో టీ, ఎమలాయిడ్ ప్రొటీన్‌లు అధిక స్థాయిలో పెరిగడానికి, అల్టీమర్స్‌కు సంబంధం ఉందని సెయింట్ లూయీస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ యో ఎల్ జ్యూ, అతడి సహచరులు తమ పరిశోధనలో గుర్తించారు. సుఖ నిద్రలేని వారిలో వీటి పెరుగుదల ఎక్కువుగా ఉన్నట్లు గుర్తించామని, ఇవి అల్టీమర్స్‌కు కారణమవుతాయని జ్యూ వెల్లడించారు. ఒకటి రెండు రోజులు కాకుండా సుదీర్ఘకాలం పాటు నిద్రకు అంతరాయం ఏర్పడితే అల్జీమర్స్ ప్రమాదం పెరుగుతుందని ఆయన అన్నారు.
Samayam Telugu sleep disruption increases alzheimers related protein levels
నిద్రలేమితో ఈ ప్రొటీన్ స్థాయిలు పెరిగితే....


ఎమలాయిడ్ బీటా, టీ ప్రొటీన్‌లు మెదడులోని ఫలకాలను, ఙ్ఞాన‌ కేంద్రాలను మూసివేయడం వల్ల అల్టీమర్స్‌కు దారి తీస్తుంది. ఎమలాయిడ్ బీటా ప్రొటీన్ స్థాయిలు నిద్రించే సమయంలో తగ్గడం, మేల్కొనేటప్పుడు పెరుగుతాయని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది.... అయితే ఒక రాత్రి నిద్రలేకపోయినా దీని స్థాయిలు పెరుగుతాయనే దానికి సష్టమైన ఆధారాలు లేవని జ్యూ అన్నారు. ఒక మోస్తరు నిద్రతో పోల్చుకుంటే గాఢ నిద్ర సమయంలోనే ఈ ప్రొటీన్ స్థాయిలు సాధారణ స్థితికి పడిపోతాయని పేర్కొన్నారు. పరిశోధనలో భాగంలో 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న 17 మంది ఆరోగ్యవంతులైన పురుషులు, మహిళలను రెండు విభాగాలుగా చేశారు. వీరిని ఒక నెల రోజుల పాటు పరిశీలించి ఈ ప్రొటీన్ స్థాయిలను విశ్లేషించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.