యాప్నగరం

Bananas : అరటిపండ్లు తింటే బెల్లి వస్తుందా..

Bananas : అరటిపండు.. అందరికీ అందుబాటులో ఉండే ఈ పండ్లు అన్నీ సీజన్లలో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా వీటిని తింటారు. ఎంత ఆరోగ్యకరమైన పండో.. ఈ పండు చుట్టూ అన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. కొన్ని పరిశోధనలు ఇది మంచి ఆరోగ్యకరమైన పండు అని చెప్పగా.. మరికొన్ని ఇది కొన్ని సమస్యలకి కారణమని చెబుతుంది. అరటిపండ్లపై ఉన్న అపోహలు ఉన్నాయి. అవేంటి.. వాటి గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

Produced byరావుల అమల | Samayam Telugu 17 Jul 2023, 5:45 pm

ప్రధానాంశాలు:

  • అరటిపండ్ల చుట్టూ ఎన్నో అపోహలు
  • వాస్తవాలు చెబుతున్న నిపుణులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu banana facts
అరటిపండ్లతోో లాభాలు
అరటిపండ్లు.. పరిచయం అక్కర్లేని పండు.. ఎన్నో పోషకాలు, మినరల్స్, ఇతర విటమిన్స్ నిండి ఉన్న ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయని అంటారు. అందుకే డాక్టర్స్ కూడా ఈ పండుని తినడం చాలా మంచిదని అంటారు. అలాంటి ఈ పండు చుట్టూ కూడా చాలా అపోహలు ఉన్నాయి. కొంతమంది వీటిని తినడం మంచిదంటే.. మరికొందరు వీటిని తినడం వల్ల ఇతర సమస్యలు వస్తాయని చెబుతారు. మరి ఇందులో వాస్తవాలు ఏంటో ఇప్పుడు కనుక్కుందాం.
అపోహ : డయాబెటీస్‌ ఉన్నవారికి అరటిపండ్లు మంచివి కావు..

వాస్తవం : అరటిపండ్లు తక్కువ నుండి మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తినొచ్చు. ఈ విషయాన్ని చాలా పరిశోధనలు చెబుతున్నాయి.
Hiccups : ఇలా చేస్తే ఎక్కిళ్ళు క్షణాల్లో తగ్గిపోతాయట..
అపోహ : అరటిపండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది..

వాస్తవం :
ఫ్రక్టోజ్, విటమిన్ బితో నిండిన అరటిపండ్లు సహజ చక్కెరకి మూలం. ఇది ఎవరైనా, ప్రతి ఒక్కరూ తినడం చాలా మంచిది.

అరటిపండ్లు



అపోహ : అరటిపండ్లు తింటే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందా..

వాస్తవం :
అరటిపండ్లలో ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో బ్లోటింగ్ సమస్య తగ్గించి మంచి బ్యాక్టీరియాను డెవలప్ చేస్తాయి.

Also Read : Diet Mistakes : డైట్ చేస్తున్నప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

అపోహ : అరటిపండ్లు తినడం వల్ల లావు అవుతారా..

వాస్తవం :
అరటిపండ్లలో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయ. ఇవి కొవ్వును బర్న్ చేసే పదార్థం.


అపోహ : బరువు తగ్గాలనుకునేవారు అరటిపండ్లు తినకూడదు.

వాస్తవం :
అరటిపండ్లలో విటమిన్ బి6, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అప్పటికప్పుడు శక్తి వస్తుంది.

Also Read : Romance Doubts : శృంగారంలో ఆడవారికి ఎప్పుడు భావతృప్తి కలుగుతుంది..

అపోహ : బీపి ఉన్నవారు అరటిపండ్లు తినకూడదా..

వాస్తవం :
బీపి ఉన్నవారు మధ్యాహ్నం తినడానికి అరటిపండ్లు చాలా మంచివని చెప్పొచ్చు. అరటిపండ్లు సహజంగా ఎలక్ట్రోలైట్స్‌లో అధికంగా ఉంటాయి. ఇవి ఎలాంటి హాని చేయవు.



గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.