యాప్నగరం

జాగ్రత్త.. ఒళ్లు పెరిగితే, కళ్లు పోతాయట!

బరువు పెరిగితే కంటి చూపు పోయే ప్రమాదం ఉందట. వయస్సు, ఎత్తుకు తగిన వెయిట్ లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని వైద్యులు నిత్యం హెచ్చరిస్తూనే ఉంటారు.

TNN 18 Nov 2016, 2:19 pm
రువు పెరిగితే కంటి చూపు పోయే ప్రమాదం ఉందట. వయస్సు, ఎత్తుకు తగిన వెయిట్ లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని వైద్యులు నిత్యం హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే, బరువు పెరిగితే కంటి చూపు కోల్పోయే ముప్పుందని తాజాగా ఓ స్టడీలో తేలింది. కడుపు భాగంలో పేగుల వద్ద పేరుకు పోయే కొవ్వులో బాక్టీరియా కమ్యూనిటీలు ఏర్పడి వయస్సు సంబంధిత దృష్టి లోపం (Age-related macular degeneration-AMD) లేదా అంధత్వం ఏర్పడవచ్చని ఈఎంబీవో మాలిక్యులర్ మెడిసిన్ ప్రచురించిన కథనంలో పేర్కొంది.
Samayam Telugu study extra fat can damage your eyesight
జాగ్రత్త.. ఒళ్లు పెరిగితే, కళ్లు పోతాయట!


ఎండీ రోగ నిరోధకంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఎప్పుడైతే చెడు కొవ్వు పదార్థాలు వచ్చి చేరుతాయో అవి.. క్రమేనా కంటి వద్దకు చేరి చూపుపై ప్రభావం చూపుతాయని స్టడీలో తెలిపింది. కొవ్వు వల్ల ఏర్పడే బాక్టీరియా రక్త కణాలను ధ్వంసం చేయడంతోపాటు రక్తనాళాలను దెబ్బతి తీస్తాయని వెల్లడించింది. ఈ ప్రక్రియను వెట్ ఏఎండీ అని అంటారని, ఇది ముదిరితే అంధత్వం వస్తుందని వివరించింది. ఈ నేపథ్యంలో బరువును అదుపులో ఉంచుకోవడం ఎంతో మేలని స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.