యాప్నగరం

క్యాన్సర్‌ కణాలతో.. చక్కెర దోస్తీ!

చక్కెర వల్ల మధుమేహం (డయబెటీస్) వస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, మధుమేహం లేకున్నా, క్యాన్సర్ ముప్పు ఉన్నవారికి కూడా చక్కెర డేంజరేనని పరిశోధనలు తెలుపుతున్నాయి.

TNN 17 Oct 2017, 3:27 pm
క్కెర వల్ల మధుమేహం (డయబెటీస్) వస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, మధుమేహం లేకున్నా, క్యాన్సర్ ముప్పు ఉన్నవారికి కూడా చక్కెర డేంజరేనని పరిశోధనలు తెలుపుతున్నాయి. ‘నేచర్ కమ్యునికేషన్’లో ప్రచురించిన కథనం ప్రకారం.. చక్కెరలో క్యాన్సర్‌ కణాలను ఉత్తేజపరిచే ‘ras’ అనే జీన్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
Samayam Telugu sugar makes cancer tumours more aggressive study
క్యాన్సర్‌ కణాలతో.. చక్కెర దోస్తీ!


డచ్ యూనివర్శిటీతో గత 9 ఏళ్లుగా జరుపుతున్న పరిశోధనలో చక్కెర.. క్యాన్సర్ కణాలను పోషించేందుకు ఉపయోగపడుతుందని తేలింది. ఈ నేపథ్యంలో శరీరంలో దాగివుండే క్యాన్సర్ కణాలను ఉత్తేజపరిచి, త్వరగా విస్తరించేందుకు చక్కెర ఉపయోగపడుతుంది.

కేయూ ల్యూవెన్‌కు చెందిన మాలిక్యులర్ బయోలజిస్ట్ ప్రొఫోసర్ జాన్ థెవెలైన్ మాట్లాడుతూ.. ‘‘చక్కర అతిగా తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ పెంపొందించేందుకు దోహదం చేస్తోందని మా పరిశోధనల్లో తేలింది. ఇది ‘వార్‌బర్గ్’ బోలోపేతం కావడం వల్ల కాన్సర్ గెడ్డలు ఉత్తేజితం అవుతాయి’’ అని తెలిపారు.

ఈ నేపథ్యంలో చక్కెర, ఉప్పులను మితంగా తీసుకోవడమే ఉత్తమం. వీటిలో ఏది ఎక్కువైనా ఆరోగ్యానికి ముప్పే. ముఖ్యంగా వంశపారంపర్యంగా క్యాన్సర్, మధుమేహం రోగాల ముప్పు ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.