యాప్నగరం

వంకాయలోని ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు!

వంకాయ ఆరోగ్యానికి మంచిదేనా? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?

Samayam Telugu 8 Jul 2020, 9:33 pm
గుత్తి వంకాయ కూరను ఇష్టపడిన వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి. మాంచి మసాలా దట్టించి.. నూనెలో వేయించి కాడతో సహా ఆరగిస్తే భలే మజాగా ఉంటుంది. అయితే, కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు. ఎందుకంటే.. అందరికీ వంకాయ పడదు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయలను దూరంగా ఉండటమే మంచిది. అలాంటప్పుడు వంకాయను ఎలా ఆరోగ్యకరమైన కాయగూర అంటారనేగా మీ సందేహం. ఎందుకంటే.. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ ఒక్క కారణం తప్పా.. మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది. అతిగా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు.
Samayam Telugu Image by Peggy Choucair from Pixabay


ఆరోగ్య ప్రయోజనాలివే:
❂ టైప్-2 మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర్ల (గ్లోకోజ్) స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది.
❂ వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
❂ వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది.
❂ వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది.
❂ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
❂ వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.
❂ వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగిస్తుంది.
❂ వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది.
❂ వంకాయ శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను తొలగిస్తుంది.
❂ శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
❂ వంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Also Read: బస్సులో ‘ఆ’ సీన్ చేస్తూ మాస్క్ తీసిన పోర్న్ స్టార్.. అధికారులు గుర్రు

❂ ఉబ్బసం, మలబద్ధకం, పేగు సంబంధిత సమస్యలు, పుండ్లు, పెద్ద పేగు క్యానర్సన్లు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
❂ వంకాయ శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
❂ జుట్టు బలోపేతం కావడానికి వంకాయ సహకరిస్తుంది. జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
❂ మలేరియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు కాల్చిన వంకాయకు కాస్త చక్కర ముట్టించి ఇవ్వాలంటారు.
❂ నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోడానికి సుమారు 4 గంటల ముందు కాల్చిన వంకాయని తినడం ఉత్తమం.
❂ వంకాయ గుత్తి మూలశంక (పైల్స్), హేమరాయిడ్స్ నివారణ చికిత్సలో ఉపయోగిస్తారు.
❂ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం వంకాయను పిండి కట్టుల్లో వాడతారు.
❂ వంకాయ శరీర వాసనను నివారిస్తుంది.
❂ వంకాయలోని ఫైబర్ శరీరంలోని విషాన్ని, రసాయనాలను గ్రహించి పెద్ద పేగు క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.
❂ శరీరంలోని కణాలు.. క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడకుండా వంకాయ కాపాడుతుంది.
❂ వంకాయలో సోడియం తక్కువ. కాబట్టి.. బీపీ సమస్యతో బాధపడేవారు తినొచ్చు.
❂ పంటి సమస్యలను నివారిస్తుంది.

Also Read: స్నానం చేస్తూ ఆన్‌లైన్ మీటింగ్.. కౌన్సిలర్‌‌‌ను నగ్నంగా చూసి జనాలు షాక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.