యాప్నగరం

ఏడిస్తే ఆనందంగా ఉంటారట

ఏడవడం కూడా ఆరోగ్యమే. సాధారణంగా మనం బాధలో ఉన్నప్పుడు ఏడుస్తుంటాం. అలా ఏడవడం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలు బయటకుపోతాయట.

TNN 2 Oct 2016, 7:27 am
నవ్వు ఒక భోగం... నవ్వించడం యోగం... నవ్వలేకపోవడం రోగం అంటారు. మరి ఏడుపు గురించి ఎవరూ చెప్పరే. ఏడవడం కూడా ఆరోగ్యమే. సాధారణంగా మనం బాధలో ఉన్నప్పుడు ఏడుస్తుంటాం. అలా ఏడవడం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలు బయటకుపోతాయట. అలాగే కన్నీళ్లు మనిషికి రిలాక్స్‌నిస్తాయట. ఏడిస్తే మనసు తేలికవుతుంది. కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి, కళ్ళను తడిగా ఉంచడానికి వచ్చే ద్రవాలే కన్నీళ్లు. కంటి కార్నియాను తడిగా, శుభ్రంగా ఉంచేందుకు, దుమ్మును, నివారించేందుకు, పోషకాల్ని అందించడానికి కన్నీళ్లు ఉపయోగపడతాయి. కన్నీళ్లలో నీరు, మ్యుసిన్, లిపిడ్‌ , లైసోజైములు, లాక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబిలిన్‌, గ్లూకోస్, యూరియా, సోడియం, పొటాషియం వంటి అనేక పదార్ధాలు ఉంటాయి.
Samayam Telugu the health benefits of crying
ఏడిస్తే ఆనందంగా ఉంటారట


మనస్సు నిండా బాధ ఉంచుకోవడం కంటే ఏడిస్తేనే ఆరోగ్యంగా ఉంటారట. కన్నీళ్ల ద్వారా మాంగనీసు, పొటాషియం, ప్రొలాక్టిన్ బయటకు వెళ్తాయి. రక్తం గడ్డ కట్టడానికి, చర్మ వ్యాధులను నయం చేయడానికి, కొలెస్ట్రాల్ (కొవ్వు)ను తగ్గించడానికి కొద్ది మోతాదు మాంగనీసు సరిపోతుంది. నరాలు పనిచేయడానికి, కండరాల నియంత్రించడానికి, బీపీని అదుపులో ఉంచడానికి పొటాషియం ఉపకరిస్తుంది. ఒత్తిడి నివారించడానికి, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, వివిధ అవయవాలను ప్రభావవంతంగా పనిచేయించడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ ఉపయోగపతుంది. ఒకవేళ శరీరంలో వీటి మోతాదు ఎక్కువ ఉంటే ఇవి కన్నీళ్ల ద్వారా బయటకు వెళ్లడమే మంచిది.



ఏడవడం వల్ల శరీరంలోని విషతుల్యమైన రసాయనాలు బయటకుపోతాయి. మూడ్‌ బాగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు ఎమోషనల్‌, ఫిజికల్‌ బాధలు కూడా తగ్గుతాయి. మొత్తానికి ఏడ్చిన తర్వాత ఆనందంగా ఉంటారట. అలాగే ఎవరైనా ఏడుస్తుంటే వారికి ఓదార్పునివ్వడం కూడా ఎంతో అవసరం. ఓదార్చడం వల్ల ఒక అండ దొరికినట్టు వారు ఫీలవుతారు. అది వారిలోని ప్రెజర్ ను తగ్గిస్తుంది. అయితే యవ్వనంలోకి అడుగుపెట్టేవరకూ ఆడ, మగ పిల్లల ఏడుపులో తేడా ఉండదు. ఇద్దరూ సమంగా ఏడుస్తారు. ఆ తర్వాతే టెస్టోస్టెరోన్స్‌ అబ్బాయిల్లో ఈ గుణాన్ని తగ్గిస్తాయట. అమ్మాయిలు ఎక్కువగా ఏడవడానికి ఈస్ట్రోజన్‌, ప్రొలాక్టిన్లు కారణమట. అయితే బాధలో ఏడవడానికి జెండర్ తో సంబంధం లేదట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.