యాప్నగరం

Ovarian Cancer: కొంచెం తిన్నా కడుపు నిండుగా ఉంటుందా..? అండాశయ క్యాన్సర్‌ కావచ్చు..!

Ovarian Cancer: అండాశయ క్యాన్సర్‌ను మొదటి స్టేజ్‌లో గుర్తిస్తే.. దీని నుంచి విజయవంతగా పోరాటం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. అండాశయ క్యాన్సర్‌ మొదటి దశలో కనిపించే లక్షణాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 20 Mar 2023, 9:16 pm
Ovarian Cancer: ప్రతి స్త్రీకి, గర్భాశయానికి ఇరువైపులా రెండు అండాశయాలు ఉంటాయి. అండాశయాలు గర్భం కోసం ప్రతి నెలా గుడ్లు(Ovum), ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, అండాశయ క్యాన్సర్ భారతీయ మహిళల్లో మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్. మన దేశంలో వచ్చే క్యాన్సర్లలో.. 6-10 శాతం వాటా అండాశయ క్యాన్సర్లది. అండాశయాలలో అభివృద్ధి చెందే కణాల పెరుగుదలను అండాశయ క్యాన్సర్ అంటారు. ఈ కణాలు.. అరోగ్యకరమైన కణజాలంపై దాడి చేసి నాశనం చేస్తాయి. అండాశయ క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే.. దీని నుంచి విజయవంతగా పోరాటం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అండాశయ క్యాన్సర్‌ మొదటి దశలో కనిపించే లక్షణాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం..
Samayam Telugu ovarian cancer


మలబద్ధకం..
గట్‌ అరోగ్యంలో సమస్యల కారణంగా.. ఒత్తిడి, ఆందోళన, IBS, అండాశయ క్యాన్సర్‌ వంటి ఇతర అనారోగ్యాలకు దారి తీయువచ్చు. గట్‌ ఆరోగ్యానికి సంబంధించి.. అండాశయ క్యాన్సర్‌ సాధారణ లక్షణం మలబద్ధకం. జీవనశైలి మార్పులు, మెడికేషన్‌ తీసుకున్న తర్వాత కూడా.. మలబద్ధకం సమస్య తగ్గకపోతే డాక్టర్‌ కలవడం మేలు.
పొత్తికడుపు నొప్పి..
నడుము నొప్పి, పొత్తికడుపు నొప్పి మూడు వారాల పాటు కొనసాగితే.. అండాశయ క్యాన్సర్‌ సిగ్నల్‌ కావచ్చు.పొత్తికడుపులో సమస్య ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. మీ స్ట్రెస్‌ తగ్గినప్పుడు.. నొప్పి తగ్గుతూ ఉంటే ఈ నొప్పి ఒత్తిడి వల్ల కావచ్చు. మీ ఆహారంలో మార్పు చేసిన తర్వాత నొప్పి తగ్గితే.. గ్యాస్‌ సమస్య వల్ల కావచ్చు.
కడుపు ఉబ్బరం..
చాలా మంది మహిళలు కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా ఆహారం తీసుకుంటే.. కడుపు ఉబ్బరం సాధరణంగా వచ్చే సమస్యే. మహిళలు పీరియడ్స్‌ సమయంలోనూ కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఉంటారు. అయితే, కడుపు ఉబ్బరం మూడు వారాల పాటు కొనసాగితే.. అండశయ క్యాన్సర్‌ అని అనుమాన పడాల్సిందే. అండాశయ క్యాన్సర్‌‌ అత్యంత సాధారణ లక్షణాలలో కడుపు ఉబ్బరం, కడుపు నిండుగా ఉందని స్థిరమైన భావన ఉంటుంది.
ఆకలి లేకపోవడం..
అండాశయ క్యాన్సర్ సాధారణ సంకేతం ఆకలిని కోల్పోవడం. అండాశయ క్యాన్సర్ ప్రారంభ సూచనల్లో ఆకలి కోల్పోవడం, కడుపు నిండినట్లు ఉండటం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం. మీరు దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడుతుంటే.. డాక్టర్‌ దగ్గరకు వెళ్లడం మేలు.
మూత్రాశయ సమస్యలు..
మహిళలలు మూత్ర విసర్జన చేసేటప్పుడు అసౌకర్యం ఉంటే.. మూత్ర నాళ ఇన్ఫెక్షన్‌ ఉందని అనుకుంటూ ఉంటారు. అయితే, కొన్నిసార్లు మూత్రాశయంలోని సమస్యలు అండాశయ అండాశయం, పునరుత్పత్తి వ్యవస్థలో సమస్యలకు సూచన కావచ్చు. మూత్రశయంలో నొప్పి, ఒత్తిడి అనుభవిస్తున్నా, ఆకస్మికంగా మూత్రవిసర్జన చేయడం, మూత్ర విసర్జన చేయాలనే కోరిక అండాశయ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. పైన పేర్కొన్న లక్షణాలు దీర్ఘకాలికంగా ఉంటే వైద్యుడుని సంప్రదించడం మేలు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.