యాప్నగరం

Unhealthy Breakfast: మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటే అనారోగ్యాలు రౌండప్‌ చేస్తాయి జాగ్రత్త!

Unhealthy Breakfast: మనం ఉదయం తీసుకునే ఆహారం ఆ రోజంతా పని చేయడానికి కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అందుకే, బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేయవద్దని నిపుణులు సూచిస్తూ ఉంటారు. కొన్ని ఆహారాలు బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. వీటిని తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్‌, అధిక బరువు, డయాబెటిస్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 14 Jan 2023, 6:28 pm
Samayam Telugu these breakfast are unhealthy it will increase risk of diabetes and high cholesterol
Unhealthy Breakfast: మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటే అనారోగ్యాలు రౌండప్‌ చేస్తాయి జాగ్రత్త!
Unhealthy Breakfast: ఉదయం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యమైన ఆహారం. మనం ఉదయం తీసుకునే ఆహారం ఆ రోజంతా పని చేయడానికి కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అందుకే, బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేయవద్దని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలాగే, ఉదయం పూట టిఫిన్‌లో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మన బ్రేక్‌ ఫాస్ట్‌లో ఫైబర్‌, ప్రొటీన్‌, కొవ్వులు, కార్బస్‌ సమంగా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే మొలకలు, ఉడికించిన కూరగాయల ముక్కలు, తాజా పండ్లు, ఉడికించిన గుడ్డు తెల్లసొన ఉండేలా అల్పాహారాన్ని ఎంచుకుంటే కడుపునిండిన భావన కలుగుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోతే అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, నీరసం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కానీ, కొన్ని ఆహారాలు బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. వాటిని తీసుకుంటే.. అధిక కొలెస్ట్రాల్‌, అధిక బరువు, డయాబెటిస్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోకూడని ఆహారం ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

ఆలూ పూరీ..

ఆలూ పూరీ చాలా మంది ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్‌. ఇది నూనెలో ఫ్రై చేసి తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్‌, ఫైబర్‌ వంటి పోషకాలు ఉండవు. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా తింటే.. శరీరంలో కొవ్వు, కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. దీని కారణంగా.. అధిక బరువు, గుండె జబ్బులు, స్ట్రోక్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

సాంబార్‌, వడ..

సౌత్‌ ఇండియాలో సాధారణంగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌. ఇది కూడా డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్‌. దీనిని తయారు చేయడానికి మినపపప్పు వాడతారు.. ఇది జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది.

కార్న్‌ ఫ్లేక్స్‌..

వంట చేయడానికి మూడ్‌ లేనప్పుడు, పిల్లలకు ఈజీగా అయ్యే టిఫిన్‌ కోసం కార్న్‌ ఫ్లేక్స్‌ ప్రిఫర్‌ చేస్తూ ఉంటాం. కార్న్‌ ఫ్లేక్స్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే.. ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిలో పంచదార, ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కార్న్‌ ఫ్లేక్స్‌లో ఫైబర్‌ కూడా ఉండదు. అందువల్ల.. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్‌ ఆఫ్షన్‌ కాదు.

వైట్‌బ్రెడ్‌ జామ్‌..

చాలా మంది పిల్లలు.. బ్రెడ్‌, జామ్‌ తినడానికి ఇష్టపడతారు. కానీ, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ కాదు. దీనిలో చక్కెర, కార్బస్‌, ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా అధికబరువు, డయాబెటిస్‌ బారినపడే ప్రమాదం ఉంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.