యాప్నగరం

Vegetables for weight loss: ఫైబర్‌ రిచ్‌ డైట్‌తో ఈజీగా బరువు తగ్గండి..!

Vegetables for weight loss: ఫైబర్‌ డైట్ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని ఫ్యాట్ టు స్లిమ్ డైరెక్టర్‌, డైటీషియన్‌, డైరెక్టర్‌ శిఖా అగర్వాల్‌ అన్నారు. మన ఆహారంలో ఫైబర్‌‌ ఎక్కువగా తీసుకుంటే.. వెయిట్‌ లాస్‌కు సహాయపడుతుందని డైరెక్టర్‌ శిఖా అగర్వాల్‌ చెప్పారు.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 19 Dec 2022, 2:37 pm
Vegetables for weight loss: అధిక బరువు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు ఎక్కువగా ఉంటే.. తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువు వల్ల డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడం, కొంచెం కష్టమైన పనే. కొందరు బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటారు, జిమ్‌లో గంటల తరబడి వర్కవుట్లు చేస్తూ ఉంటారు. చాలామంది నిపుణులు ప్రొటిన్‌ డైట్‌ తీసుకుంటే.. త్వరగా బరువు తగ్గుతారని సిఫార్సు చేస్తున్నారు. ఇవన్నీ పాటిస్తూ.. ఫైబర్‌ డైట్ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని ఫ్యాట్ టు స్లిమ్ డైరెక్టర్‌, డైటీషియన్‌, డైరెక్టర్‌ శిఖా అగర్వాల్‌ అన్నారు. మన ఆహారంలో ఫైబర్‌‌ ఎక్కువగా తీసుకుంటే.. వెయిట్‌ లాస్‌కు సహాయపడుతుందని డైరెక్టర్‌ శిఖా అగర్వాల్‌ చెప్పారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఫైబర్‌ అధికంగా ఉండే కూరగాయలను తీసుకోవాలని అన్నారు. ఫైబర్‌‌‌‌‌‌ కడుపు, పేగుల పనితీరును మెరుగుపరిచి, బరువు తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.
Samayam Telugu these fiber rich vegetables helps in weight loss
Vegetables for weight loss: ఫైబర్‌ రిచ్‌ డైట్‌తో ఈజీగా బరువు తగ్గండి..!

ఫైబర్‌ మనకు మొక్కల నుంచి లభిస్తుంది. దీన్ని మన జీర్ణ వ్యవస్థ సులభంగా విచ్ఛిన్నం చేయలేదు. ఫైబర్‌ విచ్ఛిన్నం అయ్యి, దాన్ని గ్రహించుకునే సమయంలో శరీరం అనవసరమైన ఆహారాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది.

బ్రోకలీ..

బ్రోకలీలో ఫైబర్, విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. అధ్యయనం ప్రకారం, ఒక కప్పు బ్రోకలీలో ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది. బ్రోకోలీని సలాడ్స్‌ రూపంలో తీసుకోవచ్చు. దీని టేస్ట్‌ను ఎంజాయ్‌ చేయడానికి నూనె, వెల్లుల్లితో వేయించి తీసుకోండి.

పాలకూర..

పాలకూర మన డైట్‌లో తీసుకుంటే.. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలకూరలో ఆక్సిడేషన్‌‌ ఒత్తిడిని, రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులో కరగని ఫైబర్ ఉంటుంది. పాలకూర తరచుగా తీసుకుంటే.. మీరు బరువు తగ్గడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.

పచ్చి బఠాణీ..

పచ్చి బఠానీలు పోషకాల స్టోర్‌ హౌస్‌. ఇందులో ఫైబర్, ఐరన్‌, విటమిన్ ఎ, సీ పుష్కలంగా ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు, పచ్చి బఠాణీ వారి డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

బెండకాయ..

బెండకాయలో కాల్షియం, పొటాషియం, కార్బస్‌, ప్రొటీన్లు, విటమిన్లు, ఎంజైములు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. బెండకాయ పేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

గుమ్మడి కాయ..

గుమ్మడి కాయను చాలా మంది ఇష్టపడరు. కానీ, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయలో కాల్షియం, విటమిన్‌ ఏ, కె వంటి పోషకాలు ఉన్నాయి. దీంతో రకరకాల కూరలు, స్వీట్స్‌, సూప్‌ తయారు చేసుకుని తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి గుమ్మడికాయ బెస్ట్‌ ఆప్షన్‌.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.