యాప్నగరం

Fruits for Diabetes : షుగర్ ఉన్నవారు చెర్రీస్ తినొచ్చా..

Fruits for Diabetes : షుగర్ వచ్చాక ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం తినాలి. ఏం తినకూడదనేది తెలిసి ఉండాలి. అలానే పండ్లలో ఏం తింటే మంచిదో తెలుసుకోండి.

Produced byరావుల అమల | Samayam Telugu 8 Jul 2023, 11:49 am
షుగర్ వచ్చిందంటే దానిని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా స్వీట్స్ తినే విషయంలోనూ కొన్ని ఆలోచించి తినాలి. నోటికి తినాలనిపించినా కొన్నిసార్లు నోటినికి కట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా డాక్టర్ సూచించిన మెడిసిన్, ఫుడ్ చేంజెస్ పాటించాలి. దీంతో సమస్యని చాలా వరకూ తగ్గించొచ్చు.
Samayam Telugu these fruits are best for people with diabetes
Fruits for Diabetes : షుగర్ ఉన్నవారు చెర్రీస్ తినొచ్చా..


​న్యూట్రిషనిస్ట్ ప్రకారం..​

కానీ, షుగర్ ఉన్నవారు పండ్ల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. అందరిలానే సహజంగా లభించే పండ్లని తీసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ లవనీత్ బాత్రా చెబుతున్నారు. ఆయన ప్రకారం కొన్ని తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్ పండ్లు ఏంటో చూద్దాం.

​నారింజ పండ్లు..

నారింజ పండ్లు కూడా చాలా మంచిది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 40గా ఉంటుంది. దీంతో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా తగ్గించొచ్చు.
Also Read : Morning Drinks : ఖాళీ కడుపుతో ఇవి తాగితే మలబద్దకం, పైల్స్ సమస్య దూరం

చెర్రీస్..​

ఎర్రగా చూడగానే నోరూరించే పండుని కూడా షుగర్ ఉన్నవారు తినొచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 20 మాత్రమే ఉంటుంది. అదే విధంగా పోషకాలు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ మెరుగ్గా మారి గుండెకి కూడా చాలా మంచిది.

​పియర్స్..

మార్కెట్‌ పియర్స్ కొన్నిసార్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఇవి కనిపించినప్పుడు వీటిని అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే, ఈ పండ్లలో ఎన్నో పోషకాలతో పాటు కేలరీలు, సహజ చక్కెర కంటెంట్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లని తక్కువగా తీసుకోవాలి. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ పండు తింటే డయాబెటిక్ పేషెంట్స్‌లో చక్కెర స్థాయి అస్సలు పెరగదు.

న్యూట్రిషనిస్టులు చెబుతున్న పండ్లు..

View this post on Instagram A post shared by Nutrition.by.Lovneet (@nutrition.by.lovneet)

స్ట్రాబెర్రీస్..

ఈ పండులో నారింజ పండులో కంటే ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇందులో సహజంగానే చక్కెర, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనిని తినడం వల్ల జీర్ణవ్యవస్థకి చాలా మంచిది. షుగర్ ఉన్నవారు స్ట్రాబెర్రీస్‌ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుకోవచ్చు.
Also Read : High Blood Pressure : ఇలా అనిపిస్తే హైబీపి ఉన్నట్లే..

​యాపిల్స్..

యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం అకస్మాత్తుగా పెరగదు. అయితే, షుగర్ ఉన్నవారు రోజుకి సగం యాపిల్ తినాలని గుర్తుపెట్టుకోండి.

​ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి..

మంచివి కదా అని ఎక్కువగా వీటిని తినొద్దు. వీటిని తినే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్‌ని ఎన్ని తినొచ్చు అని అడిగి తెలుసుకోవాలి. మిమ్మల్ని పరీక్షించిన ఆయన మీకు ఉన్న షుగర్ లెవల్స్‌ని బట్టి ఎన్ని తినాలి, ఏం తినాలనేది సజెస్ట్ చేస్తారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​Read More : Relationship News and Telugu New

షుగర్‌ పేషెంట్స్‌ ఎలాంటి డైట్‌ తీసుకోవాలి..?

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.