యాప్నగరం

జ్ఞాపకశక్తి పెరగాలా? బెల్లీ ఫ్యాట్ తగ్గాలా?

ఎంత చదివినా గుర్తుకు రావట్లేదని బాధపడుతున్నారా? మెమొరీ పవర్ పెంచుకోవాలనకుంటున్నారా? ఈ డ్రింక్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.

TNN 28 Nov 2016, 4:29 pm
కొందరు ఎంత బాగా చదివినా తొందరగా మర్చిపోతారు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం వల్ల కష్టపడి చదివినప్పటికీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోలేకపోతుంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే మమొరీ పవర్ బాగా పెరుగుతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గడంతోపాటు మెదడు చురుగ్గా పని చేస్తుంది. అంతే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇంతకూ ఈ డ్రింక్ తయారీకి ఏమేం కావాలంటే..
Samayam Telugu this mixture helps you to improve memory power and burning fat
జ్ఞాపకశక్తి పెరగాలా? బెల్లీ ఫ్యాట్ తగ్గాలా?


125 గ్రాముల హార్స్‌ర్యాడిష్ (ముల్లంగిలో ఓ రకం), 3 టీ స్పూన్ల తేనె, 2 టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి, 4 నిమ్మ కాయలు, బొటన వేలి సైజులో ఉండే అల్లం ముక్క. ముందుగా ముల్లంగి, అల్లాన్ని మిక్సీ పట్టుకోవాలి. దానికి నిమ్మరసం జత చేసి బాగా కలపాలి. చివర్లో తేనె, దాల్చిన చెక్క పొడిని కలిపి బాగా కలిసేలా తిప్పాలి. చివరకు అది ఓ సిరప్‌లా తయారవుతుంది. దీన్ని రోజుకు రెండుసార్ల చొప్పున ఆహారానికి లేదా వ్యాయామానికి ముందు తీసుకోవాలి. మూడు వారాల పాటు ఇలా చేశాక రెండు రోజులు ఆగి మళ్లీ ఈ ప్రక్రియను ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల మీ మెమొరీ పవర్ పెరుగుతుంది.

ఈ డ్రింక్ తీసుకోవడంతోపాటు బీట్‌రూట్, ఉడికించిన కోడి గుడ్లు, చేపలు, బెర్రీ పండ్లు, పచ్చి ఉల్లి ముక్కలు, తృణధాన్యాలు, టమాటాలు, గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్, నట్స్, ఆపిల్ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.