యాప్నగరం

వేసవిలో తల పగిలిపోతుందా? ఇలా చేయండి!!

వేసవి వచ్చిందంటే చాలు.. తలనొప్పి తీవ్రంగా వేదిస్తుంది. వాతావరణం బాగా వేడెక్కినా, తలలో రక్తప్రసరణ సరిగా లేకున్నా, సరిగా నిద్రపోకపోయినా తలనొప్పి వస్తుంది.

TNN 29 May 2017, 6:24 pm
వేసవి వచ్చిందంటే చాలు.. తలనొప్పి తీవ్రంగా వేదిస్తుంది. వాతావరణం బాగా వేడెక్కినా, తలలో రక్తప్రసరణ సరిగా లేకున్నా, సరిగా నిద్రపోకపోయినా తలనొప్పి వస్తుంది. ఇందుకు అస్తమాను మాత్రలు వేసుకోకుండా, సురక్షితమైన పద్ధతుల్లోనే తగ్గించుకోవచ్చు. నొప్పి వచ్చినప్పుడు తల భాగమే బాధిస్తుంది. అయితే, ముఖంలోని అన్ని భాగాలనూ మద్దనా చేయడం ద్వారా నరాలను ఉత్తేజం చేయొచ్చు.
Samayam Telugu tips for headache relief
వేసవిలో తల పగిలిపోతుందా? ఇలా చేయండి!!


తలకి రెండు వైపులా మునివేళ్లతో కణతను సున్నా చుట్టిన్నట్లు రుద్దు కోవాలి. ​ మెడ, దవడల కింద కూడా మర్దనా చేయాలి. కొబ్బరి నూనె లేదా పెప్పర్‌మింట్ ఆయిల్ అందుబాటులో ఉంటే.. తలపై మాడుపై పోసుకుని మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా పది, పదిహేను నిమిషాలు మసాజ్ చేసుకుంటే తలనొప్పి నెమ్మదిగా తగ్గుతుంది.

శరీరంలో వేడి పెరిగినప్పుడు తలనొప్పి వచ్చే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో నిత్యం మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతుండాలి. తలను డ్రైగా ఉంచకుండా నూనె రాసుకోవాలి. వేసవిలో అస్తమాను తలపై స్నానం చేసినా, వేళకాని వేళ్లల్లో తలంటుకున్నా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.