యాప్నగరం

skin allergy: ఈ టిప్స్‌ ఫాలో అయితే.. స్కిన్‌‌‌ అలర్జీ ఈజీగా తగ్గుతుంది..!

ఈ రోజుల్లో స్కిన్ అలర్జీ (skin allergy) సమస్య చాలా మందికి ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని తేలికపాటి అలర్జీలను ఇంటి చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలతో స్కిల్‌ అలర్జీల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 14 Jul 2022, 11:19 am
ఈ రోజుల్లో స్కిన్ అలర్జీ(skin allergy) సమస్య చాలా మందికి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఆహార పదార్థాల వల్ల, క్రీమ్స్‌ కారణంగా, ఆర్టిఫిషియల్ నగల వల్ల చర్మంపై దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది కొన్నిసార్లు ముఖం మరియు శరీరంపై అనేక గుర్తులను వదిలివేస్తుంది. స్కిన్ అలర్జీ అనేది ఫుడ్ ఎలర్జీకి భిన్నంగా ఉంటుంది. స్కిన్‌‌‌ అలెర్జీలలో చర్మంపై దురద, ఎర్రటి దద్దుర్లు, ఎరుపెక్కడం, మంట.. వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. స్కిన్‌ అలెర్జీలు.. కొంతమంది చర్మతత్వాలకు సరిపడని వస్తువులు తాకినప్పుడు, సున్నితమైన చర్మతత్వం ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ రోగనిరోధక వ్యవస్థ వాటిని ఎదుర్కోవడానికి ప్రతిరోధకాలను విడుదల చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ అలెర్జీ సాధారణం కావచ్చు, కొన్నిసార్లు తీవ్రంగా మారతాయి.
Samayam Telugu Skin rashes

కొన్ని అలెర్జీలు, ఎక్కువ కాలం ఉంటాయి. వీటని మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. కొన్ని తేలికపాటి అలర్జీలను ఇంటి చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలతో స్కిల్‌ అలర్జీల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
టీ ట్రీ ఆయిల్‌..

మొటిమలు, మచ్చలను తగ్గించడానికి టీ ట్రీ ఆయిల్‌ సమర్థవంతంగా పని చేస్తుంది. టీ ట్రీ ఆయిల్ చర్మ అలెర్జీలను నివారించడానికి చాలా బాగా పని చేస్తుంది. టీ ట్రీ ఆయిల్‌‌లో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. టీ ట్రీ ఆయిల్‌ చాలా రకాల చర్మ అలెర్జీల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. చర్మం ఎరుపుగా మారినా, దురదలను తగ్గించడానికి టీ ట్రీ ఆయిల్‌ బెస్ట్‌ ఆప్షన్‌.
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌‌‌‌‌..

ఆపిల్ సైడర్ వెనిగర్‌ను సాధారణంగా బరువు తగ్గడానికి, జీర్ణ సమస్యలను అధిగమించడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. యాపిల్‌ సైడర్‌ వెనిగర్ చర్మ సంరక్షణకు గొప్ప ఏజెంట్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే ఎసిటిక్‌ యాసిడ్‌‌ చర్మంపై దురదలను, అలెర్జీల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది, సున్నితమైన చర్మం ఉన్నవారు ఉపయోగించవద్దని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఎలా వాడాలి..
ఒక కప్పు వెచ్చని నీటిలో, ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఇప్పుడు కాటన్ సహాయంతో ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. ఇప్పుడు దానిని కొంతసేపు ఆరనివ్వండి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే..స్కిన్‌ అలర్జీ దూరం అవుతుంది.
కొబ్బరి నూనె..

కొబ్బరి నూనె చర్మ సంరక్షణకు సమర్థవంతంగా పని చేస్తుంది. దీనిలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు అలెర్జీలను తగ్గిస్తాయి. ఎలర్జీ వల్ల వచ్చే దురదలను కూడా కొబ్బరి నూనె తగ్గిస్తుంది.
ఎలా వాడాలి..
ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని 5 సెకన్ల పాటు కొద్దిగా వేడి చేయండి. తర్వాత ఈ వేడి నూనెను మీకు అలెర్జీ ఉన్న ప్రాంతంలో రాయండి. దీనిని మసాజ్ చేయవద్దు. ఒక గంట పాటు అలాగే ఉంచండి. మీరు 3-4 గంటల తర్వాత మళ్లీ కొబ్బరి నూనెను రాయండి. ఇలా చేస్తే చర్మ అలర్జీలు దూరమవుతాయి.
అలెవెరా జెల్‌..

కలబందలో ఎలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని అందరికి తెలుసు. స్కిన్ అలర్జీలను తగ్గించడానికి కలబంద సహాయపడుతుంది. అలర్జీ ఉన్న ప్రదేశంలో కలబంద గుజ్జును అప్లై చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. అలెర్జీల కారణంగా, దురద, చర్మం పొడిబారుతుంటే.. కలబందలోని ఔషద గుణాలు మంట, దురద నుంచి త్వరగా తగ్గిస్తాయి. మొటిమలు, మచ్చల్ని తగ్గించడంలోనూ కలబంద సహాయపడుతుంది.
ఎలా వాడాలి..
అలర్జీ ఉన్న ప్రదేశంలో తాజా కలబంద గుజ్జును చర్మానికి అప్లై చేయాలి. మీ వద్ద కలబంద లేకపోతే, మీరు అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్‌ను అప్లై చేసి 30 నుండి 40 నిమిషాల పాటు అలాగే ఉంచితే, దురద, మంట నుంచి కొద్ది రోజుల్లో ఉపశమనం పొందవచ్చు.
బేకింగ్‌ సోడా..

చర్మ అలర్జీలను తగ్గించడానికి బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. మీరు చర్మ అలెర్జీల వల్ల ఇబ్బంది పడుతుంటే బేకింగ్ సోడా సమర్థవంతంగా పని చేస్తుంది. అయితే, దీనిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బేకింగ్‌ సోడా చర్మం పిహెచ్‌ను బ్యాలెన్స్‌ చేయడానికి సహాయపడుతుంది.
ఎలా వాడాలి..
ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకుని అందులో కొద్దిగా నీరు కలపాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్‌లా చేసి అలర్జీ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయండి. రోజుకు 3 నుంచి 4 సార్లు ఈ పేస్ట్‌ అప్లై చేస్తే.. అలెర్జీ తర్వగా తగ్గుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.