యాప్నగరం

ఉదయాన్నే నెయ్యి తాగుతున్నారా?

ఉదయాన్నే టీ, కాఫీలకు బదులు రెండు చెంచాల నెయ్యి తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. నెయ్యిని ఆహారంతో తీసుకోవడం కంటే పరగడుపున తాగితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

Samayam Telugu 25 Apr 2019, 2:42 pm
మనలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే అవి తాగనిదే బెడ్ మీద నుంచి కిందికి కూడా దిగరు. ఉదయాన్నే అవి తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా మానలేరు. అయితే ఉదయాన్నే టీ, కాఫీలకు బదులు రెండు చెంచాల నెయ్యి తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. నెయ్యిని ఆహారంతో తీసుకోవడం కంటే పరగడుపున తాగితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందామా..
Samayam Telugu pjimage (8)


* అల్సర్‌తో బాధపడేవారు ఉదయాన్నే నెయ్యి తాగితే సమస్య తగ్గుతుంది.
* ఖాళీ కడుపుతో నెయ్యి తాగ‌డం వ‌ల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ దూరం అవుతాయి.
* నెయ్యి తాగితే బరువు పెరుగుతామని చాలామంది ఆందోళన పడుతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మన శరీరానికి మేలు చేసి బరువు తగ్గడంతో సాయపడతాయి.
* రోజూ ఉదయాన్నే నెయ్యి తాగడం వల్ల స్కిన్ కాంతివంతంగా మారుతుంది. జుట్టు ఆరోగ్యంగా మారి ఊడటం తగ్గుతుంది.
* ఆకలి మందగించిన వారు రోజూ ఉదయాన్నే నెయ్యి తాగితే ఆకలి పెరుగుతుంది.
* గర్భిణీలకు నెయ్యిని కచ్చితంగా తీసుకోవాలి. దీనిలోని ఎన్నో పోషకాలు పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు సాయపడతాయి.
* ఉదయాన్నే నెయ్యి తీసుకుంటే కంటి సమస్యలు దూరమవుతాయి. దీనిలో ఉండే విటమిన్ ఎ కళ్లకు ఎంతో మంచిది.

నెయ్యిని నిర్ణీత మోతాదులో తీసుకుంటేనే ఈ ప్రయోజనాలన్నీ అందుతాయి. మోతాదు పెరిగితే మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.