యాప్నగరం

Banana peel benefits: అరటిపండు తొక్క తింటే.. క్యాన్సర్‌ రాదంట..!

మనం సాధారణంగా అరటిపండు తిని.. తొక్కలూ పడేస్తాం.. అరటి పండు తొక్కలోనూ పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అరటిపండు తొక్క తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అమెరికన్ పోషకాహార నిపుణురాలు ఎరిన్ కెన్నీ అంటున్నారు. అరటిపండు తొక్కలో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని, ఇవి క్యాన్సర్‌కు కారణం అయ్యే.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయని అన్నారు.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 10 Aug 2022, 11:02 am
బంగారు రంగులో ఉండే అరటి పండ్లను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఎనర్జీ బూస్టర్‌ ఫుడ్. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఆరటి పండు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఫ్యాట్స్‌, పిండిపదార్థాలు, ప్రోటిన్‌, ఫైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పొటాషియం, ఫాస్ఫరస్‌, పెప్టిన్‌, సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌, విటమిన్‌-సి, విటమిన్‌-బి6 వంటి పోషకాలు ఉంటాయి. కొలెస్ట్రాల్‌ అసలు ఉండవు. హైపర్‌టెన్షన్‌ సమస్యతో బాధపడేవారికి అరటి పండు మేలు చేస్తుంది. బాగా పండిన అరటిపండు తింటే మలబద్ధకం ఉండదు. దీంట్లో ఉండే పెప్టిన్‌ పేగులకు మేలు చేస్తుంది. విరేచనం సాఫీగా జరిగేలా చూస్తుంది. దీంట్లో ఉండే ఫాస్ఫరస్‌ ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. నెలసరికి ముందు ఆందోళన, ఒత్తిడి, అలసటతో బాధపడేవాళ్లు దీన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. మనం సాధారణంగా అరటిపండు తిని.. తొక్కలూ పడేస్తాం.. అరటి పండు తొక్కలోనూ పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అరటిపండు తొక్క తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అమెరికన్ పోషకాహార నిపుణురాలు ఎరిన్ కెన్నీ అంటున్నారు. అరటిపండు తొక్కలో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని, ఇవి క్యాన్సర్‌కు కారణం అయ్యే.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయని అన్నారు.
Samayam Telugu banana peel

View this post on Instagram A post shared by Erin Kenney, MS, RD, HCP, CPT (@nutritionrewired)


పేగులకు మంచిది..

అరటిపండు తొక్కల్లో రెండు రకాల ప్రీబయోటిక్స్, రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటాయని పోషకాహార నిపుణురాలు ఎరిన్ కెన్నీ అన్నారు. ఇవి పేగుల్లో చెడు బ్యాక్టీరియాను తగ్గించి, మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయని ఎరిన్ కెన్నీ చెప్పారు.
ఫైబర్‌ రిచ్..

అరటి తొక్కల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుందని ఎరిన్‌ అన్నారు. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి అరటి పండు తొక్కలు ఔషదంలా పనిచేస్తాయని చెప్పారు. పచ్చి అరటిపండు తింటే విరేచనాలు తగ్గుతాయని అన్నారు.
యాంటీఆక్సిడెంట్స్‌ ఫుల్‌..

అరటిపండు తొక్కల్లో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని ఎరిన్ కెన్నీ అన్నారు. శరీర జీవక్రియను మెరుగుపరచడానికి ఇవ సహాయపడతాయని అన్నారు.
క్యాన్సర్‌కు చెక్‌..

అరటిపండు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, దాని తొక్కలు అంతే ప్రయోజనకరంగా ఉంటాయని ఎరిన్‌ కెన్సీ అన్నారు. అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అరటి తొక్కలు రెగ్యులర్‌గా తీసుకుంటే.. క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
కంటికి మంచిది..

అరటిపండు, వీటి తొక్కల్లో విటమిన్‌ ఏ పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ ఏ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి విటమిన్‌ ఏ ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి, ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ, చర్మ ఆరోగ్యానికి విటమిన్‌ ఏ ఎంతో అవసరం. రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను విటమిన్‌ ఏ రక్షిస్తుంది.
ఒత్తిడి దూరం..

అరటిపండు తొక్కల్లో ట్రిప్టోఫాన్‌ ఉంటుంది. ట్రిప్టోఫాన్ విచ్ఛిన్నమైనప్పుడు సెరోటోనిన్‌గా మారుతుంది, ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అరటి తొక్కల్లో విటమిన్‌ బి6 పుష్కలంగా ఉంటుంది.. విటమిన్ B6 నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.