యాప్నగరం

రోజూ గుప్పెడు వేరుశెనగలు తింటే....

రోజూ గుప్పెడు వేరుశెనగ తీసుకుంటే పొట్టలో బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందట.

TNN 4 Feb 2017, 7:12 pm
రోజూ గుప్పెడు వేరుశెనగ తీసుకుంటే పొట్టలో బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందట. ఇందులో క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, జింక్, బోరాన్‌ లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఆనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రాణాంతక వ్యాధులైన కేన్సర్, గుండె జబ్బులు దరిచేరవట.
Samayam Telugu uses and health benfits of ground nuts and oil
రోజూ గుప్పెడు వేరుశెనగలు తింటే....

వేరుశనగలోని ఫైబర్‌, యాంటిఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు శరీర ఆరోగ్యానికి సహకరించి ఆయుష్షును పెంచుతాయట.

అధిక బరువు, ఆర్థరైటిస్ నివారణకు వేరుశెనగ తోడ్పడుతుందట. దీనిలోని ఇనుము రక్తహీనతను నివారించి హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. పల్లీలతోపాటు దీని నుంచి తీసిన నూనె కూడా మంచిదే.

వేరుశెనగను రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్‌ ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు వేరుశనగను మించిన ఔషధం లేదు. అలాగే గర్భిణులు, బాలింతలు తీసుకుంటే మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి. వేరుశనగతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.