యాప్నగరం

ప్రముఖ నటుడు కాన్సర్‌‌తో మృతి..

నటుడు రిషీ కపూర్ కాన్సర్ ని జయించలేకపోయారు. ఆయనను బాధించిన కాన్సర్ గురించి కొన్ని విషయాలు..

Samayam Telugu 30 Apr 2020, 12:42 pm
ప్రముఖ నటుడు రిషీ కపూర్ కాన్సర్ కారణంగా మృతిచెందారు.. కాన్సర్ తిరగబెట్టటం వలన ఈ మరణం సంభవించిందని అంటున్నారు. ఆయన వయసు 67 సంవత్సరాలు.
Samayam Telugu rishi kapoor toi


కొలోన్ ఇన్ ఫెక్షన్ వలన ఇర్ఫాన్ ఖాన్ మరణించిన వార్తని ఇంకా జీర్ణించుకోకముందే మరో ప్రముఖ వ్యక్తి మరణించారు. ఈ వార్త మనకు తెలిసింది. నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగులేనందువలన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయన సోదరుదు రణ్‌దీర్ కపూర్ ముందుగా మీడియా తో మాట్లాడుతూ ఎలాంటి తీవ్రమైన సమస్య లేదన్నారు.

Also Read : ఈ రాశుల వారు పెళ్లి చేసుకుంటే ఎప్పుడూ గొడవలేనట..

"ఆయన హాస్పిటల్ లో ఉన్నారు. ఆయన కాన్సర్ తో బాధపడుతునారు. ఇంకా శ్వాస తీసుకోవడం సమస్యలు కూడా రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేశాం. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ గానే ఉంది." అని తెలిపారు. రిషీ కపూర్‌కి భార్య నీతూ కపూర్, పిల్లలు రణ్ బీర్ కపూర్, రిధిమా కపూర్ ఉన్నారు.

రిషికపూర్ గురించి కొన్ని విషయాలు..

రిషీ కపూర్ ఈ మధ్య కాలంలో అనారోగ్యంగా ఉన్నారు. 2018 లో ఆయన కు కాన్సర్ ఉందని తెలియడంతో ఆయన్ని వెంటనే చికిత్స కోసం న్యూయార్క్ తీసుకెళ్ళారు. అయితే కుటుంబంలో ఎవరూ ఆయన కి వచ్చిన కాన్సర్ గురించి గానీ, చికిత్సా విధానం గురించి గానీ వివరాలేమీ ఇవ్వకపోయినా, వారు ఎదుర్కొంటున్న కష్టకాలం గురించి తర్వాత మాట్లాడుతూనే ఉన్నారు. రిషీ కపూర్ మాత్రం తను చికిత్స తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఆయాన బోన్ మారో గురించి చాలా చెప్పారు.

Also Read : బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ వ్యాధితోనే చనిపోయాడు.. అసలు ఆ వ్యాధి ఏంటంటే..

ఈ సంవత్సరం మొదట్లో ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులెదురైతే ఆయనని ఢిల్లీ లోని ఒక హాస్పిటల్ లో ఎవ్వరికీ తెలియకుండా అడ్మిట్ చేశారు. ఆయనని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు. వార్త బయటికి రాకపోయినా ఆయన న్యుమోనియా తో బాధపడుతున్నట్టు తెలిసింది.

ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయన కుటుంబాన్నీ, స్నేహితులనూ ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. తను అనారోగ్యాన్ని ఆయన అంగీకరించలేకపోతున్నారని తెలిసింది. ఆయన ఒకసారి ఇలా అన్నారట.

"నాకు కొంచెం జ్వరంగా ఉంది. డాక్టర్లు న్యుమోనియా ని అనుమానించి పరీక్షలు చేస్తే వారి అనుమానం నిజమని తెలిసింది. చికిత్స తరువాత నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నా ఆరోగ్యం గురించి రకరకాల కథనాలు వచ్చాయని నాకు తెలుసు. అవన్నీ నమ్మకండి. నేనిప్పుడు ముంబై లోనే ఉన్నాను. మీతో వినోదాన్ని పంచుకోవడానికి ఎదురు చూస్తున్నాను".

Also Read : గుడ్డు ఉడకబెట్టి తింటే మంచిదా.. పచ్చిగానే తీసుకోవాలా..

రిషీ కపూర్ ఎప్పుడూ ఏ విషయానికైనా సానుకూలంగానే స్పందిస్తారు. ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ లో ఆయన తన ఆరోగ్యం గురించి ఇలా అన్నారు:

"రోజులు బాగా లేవు అంటే అర్ధం నాకేదో ప్రమాదకరమైన సర్జరీ జరిగిందనో, నేను తీవ్రమైన నొప్పి తో బాధపడుతున్నానో కాదు. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య ఉంటుంది. ఈ సమస్య కిడ్నీ గురించి కావొచ్చు. లివెర్ కి సంబంధించినది కావొచ్చు. గుండె జబ్బులు కావచ్చు. నాకు మారో తో సమస్య వచ్చింది, నేను ఆ సమస్యని పోగొట్టుకోగలిగాను. అందులో ప్రమాదకరమైనది ఏదీ లేదు. అయితే రెండు చికిత్సా కాలాల మధ్య చాలా సమయం ఉండడంతో, మేము ఎక్కువగా అటూ, ఇటూ తిరిగేవాళ్ళం. ఏం చేస్తాం చెప్పండి, విమానప్రయాణం చెయ్యకూడదూ, ఎక్కువ దూరం ప్రయాణించకూడదూ అంటే ఎలా.. నేను తీసుకున్న చికిత్స విజయవంతమైంది. నా కుటుంబం, స్నేహితులూ, అభిమానులూ నాకిచ్చిన బలానికి కృతజ్ఞుణ్ణి. వీరందరూ ఇచ్చిన ధైర్యానికి ధన్యవాదాలు". అని తెలిపారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాము.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.