యాప్నగరం

ఈ అలవాట్లు మానకపోతే.. గుండె ఆగుతుంది!

మన జీవితంలో తెలిసో తెలియకో చేసుకున్న కొన్ని అలవాట్లు... ఎంత ప్రయత్నించినా మానుకోవడం కష్టమే. వాటిలో కొన్ని అలవాట్లు అనారోగ్యాలకు సైతం దారి తీస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తాయి. ఆ ప్రమాదకరమైన అలవాట్లు ఏమిటీ? వాటి వల్ల గుండెకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో చూడండి.

TNN 29 Dec 2017, 8:16 pm
మన జీవితంలో తెలిసో తెలియకో చేసుకున్న కొన్ని అలవాట్లు... ఎంత ప్రయత్నించినా మానుకోవడం కష్టమే. వాటిలో కొన్ని అలవాట్లు అనారోగ్యాలకు సైతం దారి తీస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి. ఆ ప్రమాదకరమైన అలవాట్లు ఏమిటీ? వాటి వల్ల గుండెకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో చూడండి.
Samayam Telugu video 10 daily habits that are slowly hurting your heart
ఈ అలవాట్లు మానకపోతే.. గుండె ఆగుతుంది!


‘నాకు నిద్ర చాలా తక్కువ’
నిద్ర ఎంతో ముఖ్యం. రాత్రంతా నిద్రలేకుండా సోషల్ మీడియా, వీడియోలు, టీవీ చూస్తూ గడిపేస్తే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.

‘గురక బాగా పెడతా’
అతిగా గురకపెట్టే అలవాటు తీవ్ర రక్తపోటుకు దారితీస్తుంది. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది.

‘టీవీ అతిగా చూస్తా’
అతిగా టీవీ చూడటం, గేమ్స్ ఆడటం.. దూమపానం కంటే ప్రమాదకరమని పరిశోధనలు తెలుపుతున్నాయి. కదలకుండా ఒకే చోట కూర్చుంటే గుండె వ్యాధుల ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నాయి.

‘రోజంతా పని ఒత్తిడి’
మితిమీరిన పని ఒత్తిడి కూడా గుండెకు చేటే. ఒత్తిడి వల్ల గుండె దడ పెరిగి ధమనులు దెబ్బతినే ప్రమాదం ఉంది.

‘ఉప్పు తక్కువైతే తినలేను’
సోడియంలో నీరు ఎక్కువగా ఉంటుంది. అది రక్తంలో కలిస్తే రక్త పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.

‘ఆహారంపై పెద్దగా శ్రద్ధ పెట్టను’
సరైన సమయానికి సమతూల్య ఆహారం తీసుకుంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

‘చిగుళ్లు శుభ్రం చేసుకోను’
దంతాలు, చిగుళ్లు శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యం. అవి శుభ్రంగా ఉంటేనే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.

‘టీ, కాఫీలు అలవాటు లేవు’
రోజూ టీ తాగితే గుండె వ్యాధులు తగ్గుతాయని పరిశోధకులు తెలుపుతున్నారు.

‘చేతులు కడిగే అలవాటు లేదు’

అతిగా చేతులు గడటం ఓసీడీ‌గా భావించినా, అది మంచి లక్షణమే. చేతి ద్వారా శరీరంలోకి చేరే క్రిములు గుండెకే కాదు, మిగతా అవయవాలను కూడా నష్టపరుస్తాయి.

(ఈ ఆర్టికల్‌కు సంబంధించిన పై వీడియోను వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లోగోలను క్లిక్ చేసి మీ అకౌంట్లలోకి షేర్ చేసుకోవచ్చు)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.