యాప్నగరం

మనకొచ్చే కలలపై ‘ఆ వీడియోల’ ప్రభావం

పగటి పూట హాట్ హాట్ భామల వీడియోలను చూస్తున్నారా? నరుక్కోవడాలు, చంపుకొనే వీడియోలంటే మీకు ఇష్టమా? అయితే ఈ ఆర్టికల్ చదివితే బెటర్..

TNN 18 Nov 2016, 12:41 pm
పగటి పూట హాట్ హాట్ సెక్సువల్ వీడియోలను చూస్తున్నారా? లేదంటే హింస్మాతకంగా ఉండే వీడియోలను వీక్షిస్తున్నారా? దీని ప్రభావం మీ కలలపై పడుతుందట. హింసాత్మక వీడియోలను చూసినవారికి నిద్రకు ఉపక్రమించిన గంటన్నరలోనే భయంకరమైన కలలు వచ్చే అవకాశం 13 రెట్లు ఎక్కువగా ఉంటుందిట. అలాగే సెక్సువల్ వీడియోలను చూసినవారికి సెక్స్‌కు సంబంధించిన కలలు వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువగా ఉందని ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. హింసాత్మక, సెక్సువల్ మీడియా ప్రభావం మెలకువగా ఉన్నప్పుడు మనపై ఉంటుందని తెలుసు, కానీ నిద్రించేటప్పుడు కూడా దాని ప్రభావం ఉంటుందని వీరి పరిశోధనలో వెల్లడైంది. మన కలల్ని అవి ఎలా ప్రభావితం చేస్తాయనేందుకు సాక్ష్యం దొరికిందని ప్రొఫెసర్ బ్రాడ్ బుష్‌మ్యాన్ తెలిపారు.
Samayam Telugu watching violent sexual media may influence dreams
మనకొచ్చే కలలపై ‘ఆ వీడియోల’ ప్రభావం


కలలపై హింసాత్మక, సెక్సువల్ వీడియోల ప్రభావాన్ని నిర్ధారించడానికి వారు పది నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న 1,287 మందిపై పరిశోధనలు జరిపారు. వీరిలో 80 శాతం మంది తమకు హింసాత్మక సంఘటనలు కలలోకి వస్తున్నాయని తెలిపారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.