యాప్నగరం

How to control acidity : పప్పు తిన్నప్పుడు గ్యాస్ రావొద్దొంటే ఇలా చేయండి..

How to control acidity : పప్పులు శాకాహారులకి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవి ప్రోటీన్, ఖనిజాలు, ఫైబర్, పోషకాలతో నిండి ఉంటాయి. కానీ, కొన్ని పప్పులు తింటే పొట్టలో గ్యాస్‌కి కారణమవుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సార్లు ఈ పప్పులు తింటే కడుపులో యాసిడ్ పెరుగుతుంది. ఇది తీవ్ర సమస్యలకి కారణమవుతుంది. అందువల్ల ఈ పప్పులని రాత్రుళ్ళు కాకుండా మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

Produced byరావుల అమల | Samayam Telugu 29 Nov 2022, 5:27 am
ఇప్పుడు 4 రకాల పప్పులు ఏంటి.. వాటిని ఎలా వండాలి.. . వాటి వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu ways to cook dal correctly to prevent gas and acidity know here
How to control acidity : పప్పు తిన్నప్పుడు గ్యాస్ రావొద్దొంటే ఇలా చేయండి..


​తెల్ల బఠానీలు..

చాలా మంది వీటిని వండుతారు. ఇది హెల్దీ పప్పుల్లో ఒకటి. ప్రోటీన్, ఫైబర్‌తో ఇవి నిండి ఉంటాయి. జీర్ణక్రియ విషయానికి వస్తే.. ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రకమైన బీన్స్ వల్ల కలిగే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించేందుకు వాటిని 12 గంటలు నానబెట్టి ఇంగువ వేసి ఉడికించాలి. అయితే, వీటిని తినేటప్పుడు తక్కువ మోతాదులో తినడం మంచిదని గుర్తుపెట్టుకోండి.

Also Read : Fertility Diet : వీటిని తింటే త్వరగా ప్రెగ్నెంట్ అవుతారట..

​మినపప్పు..

ఇందులో తెల్ల మినపప్పు, నల్ల పప్పు రెండు ఉంటాయి. వీటిని తినడం వల్ల కూడా గ్యాస్ సమస్య వస్తుంది. జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు వీటిని తినకూడదని చెబుతారు. దీనిని వాయు సంబంధ పప్పు అంటారు. కాళ్ళు, పాదాల నొప్పికి సంబంధించి సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం మంచిది. ఎందకంటే ఈ నొప్పి అజీర్ణం వల్ల వస్తుంది. ఈ పప్పుని వండడానికి ముందు కనీసం 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టాలి. పప్పుని నానబెట్టి వండడం మంచిది. వండే సమయంలో ఇంగువ వాడడం మంచిది. అదే విధంగా ఉల్లిపాయ తక్కువ వేయాలి.

Also Read : Mental Health : ఈ 5 పాటిస్తే మీ ఆనందాన్ని ఎవరు దూరం చేయలేరు..

​శనగ​పప్పు..

ప్రోటీన్, ఫైబర్‌తో నిండి ఉంటుంది ఈ పప్పు. ఇది చాలా పోషకమైనదని చెప్పొచ్చు. కానీ, మనం ఈ పప్పు ఎప్పుడు తిన్నా గ్యాస్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పప్పుని ఎప్పుడు వండినా ఎర్ర కందిపప్పుతో కలిపి వండండి. ఇలా చేస్తే జీర్ణమవుతుంది. వండే ముందు కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టాలి. ఆ నానబెట్టిన నీటిని కూడా పారపోయండి. వీటిని ఉడికించేప్పుడు మెంతులు కలపడం మంచిది. దీంతో మంచి రుచి రావడమే కాకుండా గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గిస్తాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ పప్పు వండేటప్పుడు ఇంగువ, ధనియాల పొడి, మెంతి పొడి కలపడం మంచిది. దీంతో గ్యాస్టిక్ సమస్య అంతగా రాదు.

Also Read : Possessive Wife : మా నాన్నలాగే నా భర్త చేస్తాడేమోనని భయంగా ఉంది..

​కందిపప్పు..

ఈ పప్పు సాధారణంగా చేస్తుంటాం. ఇది ఎక్కువ పోషకాలతో నిండి ఉంటుంది. కానీ, చాలా మంది దీనిని విడిగా వండుతారు. దీంతో ఇది కడుపులో గ్యాస్‌కి కారణమవుతుంది. దీన్ని అధిగమించేందుకు ఈ పప్పుని చేసినప్పుడల్లా ఎర్ర కందిపప్పుని సమాన పరిమాణంలో కలపండి. దీంతో ఇది సులభంగా జీర్ణమవుతుంది. అలాగే దీనిని వండేందుకు ఓ అర గంట నుంచి గంట వరకూ నానబెట్టండి. దీంతో కడుపులోని గ్యాస్ సమస్య తొలగిపోతుంది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా ఉండాలంటే ఇంగువ, మెంతులు, ధనియాలతో పోపు వేయండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.