యాప్నగరం

ఫేస్ మాస్క్ వాడుతున్నారా... అయితే ఈ టిప్స్ పాటించండి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఫేస్ మాస్క్ వాడుతున్నారు. ఇది మంచిది కాదని కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలుసుకోండి..

Samayam Telugu 18 Jun 2020, 11:07 am
కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ వాడుతున్నారు. దీని వల్ల కరోనా నుంచి బయటపడుతున్నారని భావిస్తున్నారు అయితే, మంచితో పాటే చెడు కూడా ఉన్నట్లు ఈ మాస్క్ వల్ల మేలు ఎంత జరుగుతుందో నష్టం కూడా అంతే జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
Samayam Telugu face mask toi 1


Also Read : గౌట్ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలా తగ్గించుకోవచ్చంటే..
అవునండి.. ఇదేదో ఊరికే చెబుతున్నది కాదు. దీనిని వాడడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని దూరం చేసుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అసలు ఈ ఫేస్ మాస్క్ ఎప్పుడు ప్రమాదకరం.. దీనిని ఎందుకు వాడకూడదో తెలుసుకోండి..

ఫేస్ మాస్క్ ఎప్పుడు కూడా కాసేపే ధరించాలి. అలా కాకుండా మాస్క్ ఎప్పుడూ కొంతసేపు మాత్రమే ధరించాలి. చాలా సేపు మాస్క్ ఉంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే..



Also Read : భార్యలు సెక్స్ విషయంలో ఇవే ఎక్స్‌పెక్ట్ చేస్తారు

1. రక్తం లో ఆక్సిజన్ తగ్గిపోతుంది.
2. మెదడుకి కావాల్సినంత ఆక్సిజన్ సరఫరా జరగదు.
3. నీరసంగా అనిపిస్తుంది.
4. మరణం కూడా సంభవించవచ్చు.

ఇది నిపుణులు చెబుతున్న మాట.

ఇలా జరగుకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు ఏం చెబుతున్నారంటే..



Also Read : ఇంట్లోనే ఐబ్రోస్ థ్రెడింగ్ చేసుకోండి ఇలా..

ఏ. ఒక్కరే ఉన్నప్పుడు మాస్క్ తీసెయ్యండి.
కొంతమంది ఒక్కరే ఉన్నప్పుడు కూడా మాస్క్ వాడుతున్నారు.. ఇది అవసరం లేదని చెబుతున్నారు. మీరు ఒకరినుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మాస్క్ వాడండి.. అంతేకానీ, ఒక్కరు ఉన్నప్పుడు అవసరం లేదు. జన సమూహాల్లో బయటికి వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్ వాడండి.
బీ. ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ అవసరం లేదు.
సీ. ప్రజలు గుంపుగా ఉన్న ప్రదేశానికి మీరు వెళ్ళినప్పుడూ, ఎవరితోనైనా దగ్గరగా ఉన్నప్పుడూ మాత్రమే మాస్క్ ధరించండి.
డీ. మీరు ఒంటరిగా ఉంటే మాస్క్ వేసుకోవాల్సిన ఆవశ్యకతను బాగా తగ్గించవచ్చు.

ఇలా అతి జాగ్రత్తల వల్లే లేనిపోని సమస్యలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంతే కానీ, లేని పోని విషయాలకి వెళ్లి సమస్యలు తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.