యాప్నగరం

Brain Stroke : స్ట్రోక్ వచ్చినప్పుడు బాడీలో ఏం జరుగుతుందంటే..

Brain Stroke : స్ట్రోక్.. దీనినే బ్రెయిన్ అటాక్ అంటారు. ఇది ఎందుకొస్తుంది.. ఏయే లక్షణాలు ఉంటాయి.. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Produced byరావుల అమల | Samayam Telugu 8 Jul 2023, 11:29 am
బ్రెయిన్ అటాక్.. బ్రెయిన్‌‌లోని కొంత భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు, లోపల ఏదైనా రక్త నాళం పగిలినప్పుడు బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడి దెబ్బతినడం, స్ట్రోక్ వస్తుంది. ఇది కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారుతుంది. ఇది వచ్చినప్పుడు అలర్ట్‌గా లేకపోతే ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి, దీని గురించి ప్రతి ఒక్కరూ ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Samayam Telugu what happens in a brain stroke and here to know stroke symptoms
Brain Stroke : స్ట్రోక్ వచ్చినప్పుడు బాడీలో ఏం జరుగుతుందంటే..


స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది..

CDC(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్ మన కదలికలను నియంత్రిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జీర్ణక్రియ తగ్గిపోతుంది. బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలంటే ఆక్సిజన్ అవసరం. ధమనులు మెదడులోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తాన్ని అందిస్తాయి. రక్త ప్రవాహాన్ని నిరోధించేందుకు ఏదైనా జరిగితే మెదడులోని కణాలు నిమిషాల్లోనే చనిపోతాయి. ఎందుకంటే వాటికి ఆక్సిజన్ అందదు. దీని వల్ల స్ట్రోక్ వస్తుంది.

​స్ట్రోక్ రకాలు..

స్ట్రోక్‌లో రెండు రకాలు ఉన్నాయి. అవి..

ఇస్కీమిక్ స్ట్రోక్
హెమరేజిక్ స్ట్రోక్..
Also Read : Morning Drinks : ఖాళీ కడుపుతో ఇవి తాగితే మలబద్దకం, పైల్స్ సమస్య దూరం

​ఇస్కీమిక్ స్ట్రోక్..

దీనినే మినీ స్ట్రోక్ అని అంటారు. ఇది నిజానికి కాస్తా భిన్నంగా ఉంటుంది. మెదడుకి రక్తప్రసరణని కొద్ది సమయం నిలిపివేస్తుంది. ఇది 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండదు.

హెమరేజిక్ స్ట్రోక్..

మెదడులోని ధమని రక్తాన్ని లీక్ చేసినప్పుడు, విచ్చిన్నం చేసినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. లీక్ అయిన రక్తం మెదడు కణాలపై ఒత్తిడిని కలిగించి వాటిని దెబ్బతీస్తుంది.
Also Read : Fruits for Diabetes : షుగర్ ఉన్నవారు చెర్రీస్ తినొచ్చా..

​కారణాలు..

బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా..
వయసు పెరగడం వల్ల సమస్య వస్తుంది.
అయితే ఈ మధ్యకాలంలో వయసు తక్కువగా ఉన్నవారికి కూడా వస్తుంది.
సరైన లైఫ్‌స్టైల్ లేని కారణంగా ఈ సమస్య వస్తుంది.

పక్షవాతం రావడానికి కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

​లక్షణాలు..

స్ట్రోక్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..

నడవలేకపోవడం

ముఖం వైపు వంగిపోవడం

చేతులు బలహీనంగా ఉండడం

రెండు చేతులని పైకి లేపలేకపోవడం

మాట్లాడలేకపోవడం

మాట్లాడినప్పుడు ఇబ్బందిగా ఉండడం

ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ని కలవడం, అంబులెన్స్‌కి కాల్ చేయడం ముఖ్యం.

​దృష్టి సమస్యలు..

స్ట్రోక్ వచ్చినప్పుడు సరిగ్గా కళ్ళు కనిపించవు. మీ బ్రెయిన్‌లో ఇబ్బంది ఉంటే సరిగ్గా కళ్ళు కనిపించవు. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు కనిపించనప్పుడు వెంటనే డాక్టర్‌ని కలవాలి.

తలనొప్పి..

స్ట్రోక్ వచ్చే ముందు తలనొప్పి కూడా ఉంటుంది. మెదడులోని రక్తనాళం పగిలినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. ఇది హైబీపి వల్ల ఉంటుంది. ఇది సాధారణంగా ఉంటుంది. దీనినే ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్‌కి రక్త సరఫరాని ఆపివేసినప్పుడు ఈ సమస్య వస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం, హైబీపి కారణంగా ఈ సమస్యలన్నీ వస్తాయి.

వాంతులు..

స్ట్రోక్ రావడానికి ముందు కొంతమందిలో వికారం, వాంతులు ఉంటాయి. ఇవి వస్తే స్ట్రోక్ వస్తుందని కాదు. ఈ లక్షణాలన్నీ ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే వారు మిమ్మల్ని పరీక్షించి సమస్య ఏంటో చెబుతారు.

​తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

సమస్య రాకుండా ఉండేందుకు కొన్ని లైఫ్‌స్టైల్ చేంజెస్ పాటించాలి. సిగరెట్స్, పొగాకు‌కి దూరంగా ఉండడం, హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం, సరైన బరువుని మెంటెయిన్ చేయడం, రెగ్యలర్ వర్కౌట్ చేయడం, ఆల్కహాల్ అలవాటుని తగ్గించడం పూర్తిగా మానేయడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

​​గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​​Read More : Relationship News and Telugu New

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.