యాప్నగరం

Sleeping Tips: నిద్ర సరిగ్గా పట్టట్లేదా..? మీ పరుపు కూడా ఓ కారణమంట..!

Sleeping Tips: మనం పడుకునే పరుపు, దిండు కూడా మన నిద్రను ఎఫెక్ట్‌ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పరుపు, దిండు మనకు సూట్‌ కాకపోతే.. నిద్రలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. పరుపు కంఫర్ట్‌గా ఉంటే.. మెడ నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు ఉండవు. హాయిగా నిద్రపోతారు.

Edited byరాజీవ్ శరణ్య | Samayam Telugu 15 Nov 2022, 8:46 am
Sleeping Tips: కొంతమందికి బెడ్‌ ఎక్కిన వెంటనే‌ హాయిగా నిద్రపోతారు. మరికొందరు.. నిద్రపోవడానికి చాలా కష్టపడుతుంటారు. ఈ సమస్యతో ఎక్కువ కాలంగా బాధపడుతుంటే.. నిద్రలేమిగా పరిగణించాలి. నిద్రలేమికి చాలా కారణాలు ఉంటాయి. ఉద్యోగం, ఒత్తిడి, విటమిన్ల లోపం కారణంగా నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. మనం పడుకునే పరుపు, దిండు కూడా మన నిద్రను ఎఫెక్ట్‌ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పరుపు, దిండు మనకు సూట్‌ కాకపోతే.. నిద్రలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. పరుపు కంఫర్ట్‌గా ఉంటే.. మెడ నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు ఉండవు. హాయిగా నిద్రపోతారు. ఒకవేళ్ల మీకు బాడీ పెయిన్స్‌ కారణంగా నిద్రసరిగ్గా లేకపోతే.. దానికి కచ్చితంగా సరైన పరుపు లేకపోవడమే రీజన్‌. చాలా మంది సరైన పొజిషన్‌లో నిద్రపోకపోతే.. మెడనొప్పి, వెన్ను నొప్పి వస్తుందని అనుకుంటారు. కానీ, దానికి మెయిన్‌ రీజన్‌ సరైన పరుపు లేకపోవడం.
Samayam Telugu Poor sleep pattern


అందరీకీ ఒకే రకమైన పరుపు సెట్‌ అవ్వదు. మీకు ఒకే పొజిషన్‌లో పడుకునే అలవాటు ఉంటే.. మీ స్పైన్ ఎలైన్మెంట్ సరిగ్గా ఉందని గమనించండి. ఎందుకంటే, ప్రెజర్ పాయింట్స్ వెన్నెపూసపై పడితే దాని అలైన్మెంట్‌పై ఎఫెక్ట్‌ పడుతుంది. ఇలాంటి వారికి భుజాలు, నడుము భాగంలో కొంత ఎత్తు ఉండాలి. మీ పరుపు సెలెక్ట్‌ చేసుకునేప్పుడు నాలుగు నుంచి ఆరు ఇంచుల ఎత్తు ఉండేలా చూసుకోండి.
కొంతమంది బోర్లా పడుకుంటారు. వీరికి మిడ్ సెక్షన్‌లో ఎక్స్ట్రా సపోర్ట్ అవసరం. మీకూ ఇలానే పడుకునే అలవాటు ఉంటే.. మీ పరుపు నాలుగు నుంచి ఆరు ఇంచుల ఎత్తు ఉండేలా చూసుకోండి.

కేవలం మీ స్లీపింగ్ పొజిషన్ బట్టే కాదు.. మీ శరీర బరువు ప్రకారం కూడా పరుపును ఎంపిక చేసుకోవాలి. అధికి బరువు ఉన్నవారికి.. పరుపు ఎక్కువగా అణుగుతుంది. బరువు తక్కువగా ఉన్నావారికి తక్కువగానే ప్రెస్‌ అవుతుంది. కాబట్టి 58 కేజీల లోపు బరువు ఉన్నవారికి కేవలం 3 నుంచి 5 ఇంచుల ఎత్తు ఉండే పరుపు సరిపోతుంది. మీరు 58 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే.. 5 నుంచి 6 ఇంచుల ఎత్తు ఉండే పరుపు ఫ్రిఫర్‌ చేయండి.
మీరు మెడ, వెన్నెము సమస్యలతో బాధపడుతుంటే.. ఆర్థోపెడిక్ సూచించిన పిల్లోస్, పరుపు వాడండి. ఆర్థోపిడిక్ మ్యాట్రెస్‌లో మెమరీ ఫోమ్‌ ఉంటుంది. మీరు కంఫర్ట్‌గా నిద్రపోతారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.