యాప్నగరం

Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు వీటిని తింటే మంచిదట..

Fatty Liver : లివర్.. శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లివర్‌లో కొవ్వు అధికంగా చేరడాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. దీని వల్ల లివర్ పాడయ్యే అవకావం ఉంది. అలా కాకుండా ఉండాలంటే ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవాలి. వీటితో పాటు జాగ్రత్తలు కూడా ముఖ్యమే. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

Produced byరావుల అమల | Samayam Telugu 8 Oct 2022, 9:15 am
ఫ్యాటీ లివర్ సమస్య.. దీనినే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య అని అంటారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని వల్ల శరీరానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందు నుంచి ఈ సమస్య పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం.
Samayam Telugu which food items best for fatty liver know here all
Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు వీటిని తింటే మంచిదట..


​విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్..

విటమిన్ ఈలో కూడా యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దీని వల్ల వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ఈ అనేది చర్మం, స్కిన్‌కి చాలా మంచిది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్ చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. కాబట్టి మీ డైట్‌లో వీటిని కూడా చేర్చుకోండి.

ఎవరికైతే ఫ్యాటీ లివర్ సమస్య ఉందో వారి సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదం, గుమ్మడి గింజలు, రెడ్ బెల్ పెప్పర్, ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ తమ డైట్‌లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

హోల్ గ్రెయిన్స్..

హోల్ గ్రెయిన్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా పరిశోధనల్లో వీటిని తినడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గుతుందని తేలింది. అందుకే వీటిని కూడా మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది. వీటిని ఎలా అయినా సరే మీరు తినడం మంచిది. ఇవి ఫ్యాటీ లివర్ సమస్యని కూడా చాలా వరకూ తగ్గిస్తుంది. వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్ చాలా మంచిది. ఇది ఎక్కువగా చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, నట్స్‌లో ఎక్కువగా ఉంటాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు వీటిని తినడం చాలా మంచిది.

Also Read : Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గాలా.. ఈ వర్కౌట్స్ చేయండి..

​వెల్లుల్లి..

వెల్లుల్లి మన ఆహారంలో ఓ భాగం. పచ్చల్ళు, పోపు, మసాలా అనగానే వెల్లుల్లి ఉండాల్సిందే. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో వెల్లుల్లి చాలా మంచిదని చెబుతున్నారు. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. కాబట్టి వెల్లుల్లిని రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుందని చెబుతున్నారు.

​సీజనల్ ఫ్రూట్స్..

సీజనల్ ఫ్రూట్స్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీతో పాటు లివర్‌కి కూడా చాలా మేలు చేస్తాయి. డ్యామేజ్డ్ సెల్స్‌ని రికవర్ చేస్తాయి. అందుకే పండ్లు తినడం చాలా మంచిది. ఏ సీజన్‌లో దొరికే పండ్లు అప్పుడే తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. దీని వల్ల కేవలం ఈ సమస్యకే కాదు శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే పండ్లు అధికంగా తీసుకోవడమే కాదు.. ఎప్పుడు ఏం తినాలో తీసుకోవడం ముఖ్యం.

​గ్రీన్ టీ..

గ్రీన్ టీ హెల్దీ డ్రింక్ అని అందరికీ తెలుసు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి మేలు జరుగుతుంది. కాబట్టి దీనిని కూడా రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. దీని వల్ల బరువు కూడా పెరగకుండా ఉంటారు. అదే విధంగా కొవ్వు పెరగకుండా ఉండాలన్నా, బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా గ్రీన్ టీ తాగాల్సిందే.

Also Read : Belly Button : బొడ్డుపై మసాజ్ చేస్తే ఇన్ని లాభాలా..

​బరువు తగ్గడం..

బరువు తగ్గడం కూడా ఫ్యాటీ లివర్ సమస్యని తేలిగ్గా చేస్తుంది. అధిక బరువు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇందులో భాగంగా అదిక బరువు అనేది ఫ్యాటీ లివర్ సమస్యని 5 శాతం ఎక్కువ రిస్క్‌కి గురి చేస్తుంది.

Also Read : Raju Srivastav : గుండెనొప్పితో కమెడియన్ మృతి.. జిమ్ ఎక్కువగా చేయడమే కారణమా..

ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఫ్యాటీ లివర్ సమస్యకి చాలా మంచిది. తగినంత వ్యాయామం చేయడం వల్ల చాలా వరకూ ఫ్యాటీ లివర్ సమస్య దూరమవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.