యాప్నగరం

health-threatening fungi list: ఈ ఫంగస్‌లతో ప్రాణాలకే ముప్పు.. లిస్ట్‌ రిలీజ్‌ చేసిన WHO

health-threatening fungi list: మొదటిసారిగా ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించే.. 19 రకాల ఫంగస్‌ జాబితాను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 1 Nov 2022, 1:47 pm
health-threatening fungi list: కొన్ని ఫంగస్‌ల కారణంగా.. అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు మప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. మొదటిసారిగా ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించే.. 19 రకాల ఫంగస్‌ జాబితాను విడుదల చేసింది. రోజురోజుకీ సూక్ష్మక్రిములు చికిత్సలకు లొంగని విధంగా తయారవుతున్నాయి. ప్రస్తుతం నాలుగు రకాల యాంటీఫంగల్‌ మందులే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫంగస్‌లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని WHO పేర్కొంది. దీని దృష్టిలో ఉంచుకుని.. WHO ఫంగల్ ప్రాధాన్య వ్యాధికారక జాబితా (Fungal priority pathogens list (FPPL)) . ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ ఈ నివేదిక రూపొందించింది.
Samayam Telugu fungus


ఈ లిస్ట్‌ను WHO మూడు విభాగాలుగా విభజించింది. క్రిటికల్‌, హై, మీడియం (critical, high and medium). ఫంగస్‌లో వ్యాధికారక కారకాలు, ప్రజల ఆరోగ్యంపై వాటి ప్రభావం, అవి విస్తరిస్తున్న తీరును బట్టి వాటిని విభజించారు.
క్రిటికల్‌ విభాగంలో..
క్రిప్టోకాకస్‌ నియోఫోర్‌మాన్స్‌: ఇది శ్వాస ద్వారా శరీరంలోకి చేరుకుంటుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
క్యాండిడా ఆరిస్‌: ఆసుపత్రుల్లో ఐసీయూలో బాగా అభివృద్ధి చెందుతుంది. కరోనా సమయంలో శ్వాసమార్గంలోకి వేసిన గొట్టాల్లో తిష్ఠ వేసుకొంది.
ఆస్పెర్‌గిలస్‌ ఫ్యుమిగేటెస్‌:
రోజూ ఇది చాలామందిలో శ్వాస ద్వారా లోనికి వెళ్తూనే ఉంటుంది. కానీ ఎలాంటి జబ్బు కలగజేయదు. కానీ ఊపిరితిత్తుల జబ్బులు గలవారికి, రోగనిరోధకశక్తి క్షీణించినవారికి మాత్రం ప్రమాదకరం.
క్యాండిడా ఆల్బికాన్స్‌: ఇదొక ఈస్ట్‌. సాధారణంగా నోరు, గొంతులో వచ్చే థ్రష్‌, జననాంగ ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్ల వంటి వాటికి కారణమవుతుంది.
అధిక ప్రాధాన్యత(హై):
ఈ విభాగంలో కాండిడా ఫ్యామిలీకి చెందిన మ్యూకోరల్స్ వంటి ఫంగస్‌ ఉన్నాయి. దీన్నే బ్లాక్ ఫంగస్ అని కూడా అంటారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ సోకి ఇబ్బంది పడిన రోగుల సంఖ్య వేలల్లో ఉంది.
మీడియం..
ఈ విభాగంలో Coccidioides spp, Cryptococcus gattii వంటి ఫంగస్‌లను చేర్చారు.
ఎవరికి ప్రమాదం ఎక్కువ..?
క్యాన్సర్‌, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, దీర్ఘకాల శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల పైభాగాలకు పరిమితమైన క్షయ వంటి జబ్బులు గలవారికి.. అవయవ మార్పిడి చేయించుకున్నవారికి వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటోందని హెచ్చరించింది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.