యాప్నగరం

Diabetes Side Effects : షుగర్ ఉంటే శృంగారం చేయలేరా..

Diabetes Side Effects : రక్తంలో గ్లూకోజ్‌ సాధారణం కంటే ఎక్కువగా ఉంటే షుగర్ వ్యాధి. ఇది జీవక్రియ వ్యాధి. దీని కారణంగా హృదయ సంబంధ సమస్యలు, మూత్ర పిండాలు పాడైపోవడం, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యల్ని తీసుకొస్తుంది. దీంతో పాటు అనేక సమస్యలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అందుకే ముందు నుంచి జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు నిపుణులు. తాజాగా ఈ తీపి వ్యాధి గురించి చేదు వార్త చెప్పారు నిపుణులు. దీని వల్ల అనేక అనర్ధాలు ఉంటాయట.

Produced byరావుల అమల | Samayam Telugu 11 Aug 2022, 9:25 am
డయాబెటిస్.. ఒక్కసారి వచ్చిందంటే.. దీనికి తోడు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాజా పరిశోధనల ప్రకారం డయాబెటీస్ కారణంగా లైంగిక జీవితం కూడా సమస్యగా మారుతుందని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Samayam Telugu why does diabetes cause erectile dysfunction know here all details
Diabetes Side Effects : షుగర్ ఉంటే శృంగారం చేయలేరా..



​డయాబెటీస్‌తో వచ్చే ఆరోగ్య సమస్యలు

డయాబెటీస్.. చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి పేరు తీపిగా ఉన్నప్పటికీ ఇదో మాయదారి చేదు రోగం. ఒక్కసారి వచ్చిందంటే చాలు.. అనేక సమస్యల్ని తెచ్చి పెడుతుంది. దీని కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటీస్ వచ్చిందంటే చాలు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. లేకపోతే అది మరో అనర్ధాలకి దారి తీస్తుంది. అదే విధంగా జీవన శైలిలోనూ మార్పులు తీసుకురావాల్సిందే.

Also Read : Viral Hepatitis : హెపటైటిస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఏంటంటే..

డయాబెటీస్‌తో శృంగార సమస్యలు

ఇప్పటికే ఎన్నో ఆరోగ్య సమస్యలకి మూలంగా ఉన్న ఈ డయాబెటీస్ నేడు ఇప్పుడు లైంగిక సమస్యలకి కూడా కారణంగా మారతుంది. డయాబెటిస్ వ్యధి నరాల ప్రసరణ, హార్మోన్లపై ప్రబావం చూపడంతో చాలా మంది శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరట. ఇది జీవితాన్ని ప్రతికూలంగా మార్చడమే కాకుండా లైంగిక జీవనాన్ని కూడా దెబ్బతీస్తుందని చెబుతున్ారు నిపుణులు. ఇప్పటికే అనేక సమస్యలతో ఎంజాయ్ చేయలేకపోతున్నారు దంపతులు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మధుమేహం కూడా చేరింది. మధుమేహం ఉంటే శృంగార సమస్యలు వస్తాయట.

​పురుషులపై ప్రభావం..

డయాబెటీస్ కారణంగా పురుషులు అధికంగా సమస్యలు ఎదుర్కుంటారట. అంగస్తంభన, లైంగిక కోరికలు తగ్గిపోవడం వంటివి ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలోని అధిక చక్కెర శాతం నరాలు, రక్త ప్రసరణని ప్రభావితం చేస్తాయి. దీంతో అంగస్తంభనలో సమస్యలు కలుగుతాయి. దీని కారణంగా అనియంత్రిత మధుమేహంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా తక్కువ అవుతాయి. ఇది అంగస్తంభన, కామేచ్ఛ తగ్గిపోతుంది.

Also Read : Vitamin E : విటమిన్ ఈ వాడడం వల్ల కలిగే బెనిఫిట్స్..

​స్త్రీలపై ఎలాంటి ప్రభావం..

అదే విధంగా.. స్త్రీలలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురవుతాయని చెబుతున్నారు నిపుణులు. మధుమేహం ఉన్న స్త్రీలలో కోరికలు తగ్గిపోతాయట. లైంగిక సమస్యలు రావడమే కాకుండా. జననేంద్రియ సమస్యలకి కూడా మదుమేహం కారణం అవుతుందని, దీని కారణంగా లైంగిక కార్యకలాపాలకి ఆటంకం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహ ప్రభావం స్త్రీ పురుషులిద్దరిపై ఉంటుంది కాబట్టి.. ముందు నుంచి ఇద్దరు కూడా లైంగిక సమస్యలే కాకుండా అనేక సమస్యల నుంచి తప్పించుకోవాలంటే మధుమహాన్ని దూరం చేసుకోవాలి.

​ఏం చేయాలి..

ముందుగా చెప్పుకున్నట్లు ఒక్క వ్యాధి వచ్చిందంటే దానికి తోడు చాలా సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ముందు నుంచి మధుమేహం మన శరీరంలోకి రాకుండా చూసుకోవాలి. ఒక వేళ వచ్చినా వైద్యుల సలహా కారణంగా కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాలి. సమతుల్య ఆహారం, వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని పాటించాలి.

Also Read : Relationship : పెళ్ళికి ముందు ఒకర్ని ప్రేమించా.. పెళ్ళాయ్యాక ఏమైందంటే..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.