యాప్నగరం

నా శరీరంలోని అతడి గుండె బీర్ తాగమంటోంది!

గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత బీర్ అంటే పడి చస్తున్నానంటోంది బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ.

Samayam Telugu 17 Oct 2018, 3:18 pm
గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత బీర్ అంటే పడి చస్తున్నానంటోంది ఓ మహిళ. బ్రిటన్‌కు చెందిన షెరాన్ విలియమ్సన్‌కు గెయింట్ సెల్ మయోకార్డైటిస్ అనే అరుదైన వ్యాధి ఉంది. దీని వల్ల ఆమె గుండె ఉబ్బిపోయేది. హృదయ స్పందనలు లయ తప్పేవి. రెండుసార్లు సర్జరీలు చేసినా పరిస్థితి మారలేదు. కార్డియాక్ అరెస్టై.. చాలా రక్తం పోయింది. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోకపోతే రెండు వారాలకు మించి బతకదని డాక్టర్లు హెచ్చరించారు. దీంతో బ్రెయిన్ డెడ్ అయిన ఓ సైనికుడి గుండెను ఆమెకు అమర్చారు.
Samayam Telugu beer


ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. దీంతో విలియమ్సన్‌కు పునర్జన్మ లభించింది. నా ప్రాణం నిలిపిన వ్యక్తికి 38 ఏళ్లు, అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అంతకు మించి నాకేం తెలియదని ఆమె చెప్పారు. సర్జరీ తర్వాత విలియమ్సన్‌కు సైడ్ ఎఫెక్ట్స్ మొదలయ్యాయి. తనకు బీర్ అంటే తెగ ఇష్టం ఏర్పడిందని, బీర్ తాగాలనే కోరిక కలుగుతోందని ఆమె చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.