యాప్నగరం

Menopause Diet: మెనోపాజ్‌ దశలో తినాల్సిన ఆహారాలు ఇవే..!

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 19 Apr 2023, 3:33 pm
​Menopause Diet: మెనోపాజ్‌.. స్త్రీ పునరుత్పత్తి వయస్సు ముగింపును సూచిస్తుంది. మెనోపాజ్ సాధారణంగా 47 నుంచి 53 సంవత్సరాల లోపు ఈ ప్రక్రియ జరుగుతుంది. మెనోపాజ్ యావరేజ్‌ వయసు 51 సంవత్సరాలు. ప్రతి ఆడపిల్లా పుట్టినప్పుడు దాదాపు పది నుంచి ఇరవై లక్షల అండాలతో పుడుతుంది. పీరియడ్స్‌ ప్రారంభమయ్యే సమయానికి మూడు నుంచి నాలుగు లక్షల అండాలు మాత్రమే మిగులుతాయి. ఇలా ప్రతి నెలా కొన్ని ఎగ్స్‌ విడుదలవుతూ, మెనోపాజ్ నాటికి ఇవి మొత్తం పూర్తైపోతాయి. తర్వాత అండాశయాల నుంచి ఇక ఎగ్‌ విడుదల కాదు. దాంతో పాటే హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది.
Samayam Telugu women must include these food in her diet during menopause stage
Menopause Diet: మెనోపాజ్‌ దశలో తినాల్సిన ఆహారాలు ఇవే..!

ఈ సమయంలో హార్మోన్లలో వచ్చే తేడాల కారణంగా శారీరక మార్పులు, మానసిక ఒత్తిడి, మూడ్‌ స్వింగ్స్‌, వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, యోని పొడిబారడం, అలసట, నీరసం, బరువు పెరగడం, నిద్రలేమి వంటి అనేక ఆరోగ్య సమస్యలు సమస్యలు ఎదురవుతాయి. మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి.. ఈ సమయంలో మహిళలో వారి డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. వారికి ప్రయోజనకరమైన ఆహారాలను చేర్చుకోవాలి. మెనోపాజ్‌ సమయంలో మహిళలు తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి ఈ స్టోరీలో చూద్దాం.


తాజా పండ్లు, కూరగాయలు..

మెనోపాజ్‌ సమయంలో మహిళలు వారి ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలలో విటమిన్లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కాలే, పాలకూర, బచ్చలికూర, బ్రకోలీలో విటమిన్‌ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్‌ సి అధికంగా ఉండే.. బెర్రీలు, యాపిల్స్‌, సిట్రస్ పండ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. విటమిన్‌ సి కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. యాంటీ క్యాన్సర్ పదార్థాలుగా పరిగణించే టొమాటో, గుమ్మడి, క్యారట్, బొప్పాయి లాంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. (image source - pixabay)

మెనోపాజ్‌

సోయా ఉత్పత్తులు తీసుకోండి..

సోయాలో ఐసోఫ్లేవోన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మానవ ఈస్ట్రోజెన్ పనితీరును అనుకరించే ఒక రకమైన మొక్కల ఈస్ట్రోజెన్. ఈ ఐసోఫ్లేవోన్‌లు మెనోపాజ్‌ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. హృదయ సంబంధ సమస్యలు, ఆస్టియోపోరోసిస్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి. సోయాలో ప్రొటీన్‌ మెండుగా ఉంటుంది. ఇది వృద్ధాప్యం కారణంగా క్షీణిస్తున్న కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి సహాయపడతాయి. మీ డైట్‌లో టోఫూ, ఎడామామ్, సోయా పాలు తీసుకోండి. (image source - pixabay)

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌..

ఒ మేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌‌కు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, డయాబెటిస్‌, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అభిజ్ఞా క్షీణత, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదాన్ని ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ తగ్గిస్తాయి. మెనపాజ్‌ సమయంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉండే.. సాల్మన్, సార్డినెస్, మాకేరెల్, అవిసె గింజలు, డ్రైఫ్రూట్స్ మీ డైట్‌లో చేర్చుకోండి. (image source - pixabay)

తృణధాన్యాలు..

బ్రౌ న్ రైస్, క్వినోవా, బార్లీ వంటి తృణధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. గుండె సమస్యలు, హార్మన్‌ అసమతుల్యత, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. తృణధాన్యాలలో విటమిన్ బి, విటమిన్ ఇ, మెగ్నీషియంతో సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి, ఒత్తిడని తగ్గిస్తాయి. (image source - pixabay)

నట్స్‌..

నట్స్‌, విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ ఫుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపును నిండుగా ఉంచుతాయి, ఆహారం ఎక్కువగా తీసుకోకుండా కంట్రోల్‌లో ఉంచుతాయి. నట్స్‌లో ఫైటోఈస్ట్రోజెన్స్‌ ఉంటాయి. ఇవి వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, మానసిక కల్లోలం వంటి మెనోపాజ్‌ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. నట్స్‌లో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి.. ఈ పోషకాలు ఎముకలును దృఢంగా ఉంచుతాయి. మెనోపాజ్‌ దశలో మీ డైట్‌లో.. బాదం, పిస్తా, గుమ్మడి గింజలు వంటి నట్స్‌, విత్తనాలు తీసుకోండి.

Also Read: ఈ నూనె వాసన చూస్తే.. మెనోపాజ్‌ సమస్యలకు చెక్ పడుతుంది..!

కాల్షియం, విటమిన్ డి..

మెనోపాజ్ దశలో ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం, విటమిన్‌ డి చాలా అవసరమైన పోషకాలు. ఈ పోషకాలు పొందడానికి.. మీ డైట్‌లో పాలు, పెరుగు, చీజ్‌, కాలే, బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆహారం పదార్థాలు తీసుకోండి. ఉదయం పూట సూర్యరశ్మిలో కొంతసేపు ఉంటే.. విటమిన్‌ D సమృద్ధిగా ఉంటుంది.

పులియబెట్టిన ఆహారం..

పెరుగు, దోశ, ఇడ్లీ వంటి పులియబెట్టిన ఆహార పదార్థాల్లో గట్‌ ఆరోగ్యం, జీర్ణక్రియకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ఆహారాలలో ఫైటో ఈస్ట్రోజెన్లు కూడా ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. (image source - pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.