యాప్నగరం

Leather sofa cleaning : లెదర్ సోఫాలను ఇలా క్లీన్ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయ్..

Leather sofa cleaning : చాలా మంది ఇంట్లో లెదర్ సోఫాలు ఉంటాయి. మామూలు సోఫా కంటే లెదర్ సోఫాలను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే వీటిని ఎక్కువగా కొంటుంటారు. అయితే, వీటిని ఎలా మెరిపించాలో తెలుసా.. మీ కోసమే కొన్ని టిప్స్..

Produced byరావుల అమల | Samayam Telugu 20 Jan 2023, 11:09 am
ఫర్నీచర్తోనే ఇంటికి కళ వస్తుంది. చూడగానే ఫర్నీచర్ మన కళ్ళని ఆకర్షిస్తుంది. సరైన విధంగా మెంటెయిన్ చేయాలి కానీ, అవి ఇచ్చే కంఫర్ట్నెస్ అంత ఇంత కాదు. అయితే, లెదర్ సోఫాని మెంటెయిన్ చేయడం కష్టం అనుకుంటారు చాలా మంది. కానీ, కొన్ని టిప్స్ వాడితే ఇవి ఎప్పటికీ కూడా కొత్తవాటిలా చక్కగా మెరుస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu what is the best way to clean a leather sofa
Leather sofa cleaning : లెదర్ సోఫాలను ఇలా క్లీన్ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయ్..



ఎండకి దూరంగా..

లెదర్ వస్తువులు ఎప్పటికి చక్కగా కొత్తగా ఉండాలంటే వాటిని ఎండకి దూరంగా ఉంచాలని, ఎండ తగలని చోట్ల పెట్టాలని చెబుతున్నారు నిపుణులు. ఎండవల్ల లెదర్ వస్తువులు వాటి మెరుపుని పోగొట్టుకుంటాయి. కేవలం సోఫాలే కాదు. ఇంట్లోని ఏ లెదర్ వస్తువులైనా సరే ఎండకి పెట్టకూడదు.

Also Read : Heart attacks in Winter : గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మరకలు ఎక్కువగా ఉంటే..

దాదాపు ఫర్నీచర్ పాలిష్తో మరకలు ఉండవు. కానీ, అప్పుడప్పుడు తడి గుడ్డతో క్లీన్ చేయడం కూడా మంచిది. నిజానికీ మామూలు సోఫా కంటే లెదర్ సోఫాలు త్వరగా క్లీన్ అవుతాయి. కాబట్టి ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇక కింది భాగాల్లో బూజు పేరుకుపోకుండా దులపడం చేయండి. ఇక సోఫా కార్నర్స్లో కొన్నిసార్లు దుమ్ము పేరుకుపోతుంటుంది. ఇలాంటి దుమ్ముని క్లీన్ చేసేందుకు కాస్తా గోరువెచ్చని నీటిలో డిష్ వాషర్ కలిపి గుడ్డని ముంచి క్లీన్ చేయాలి. దీనివల్ల త్వరగా మరకలు వదులుతాయి. గ్రీజ్ లాంటి మరకల కోసం కాస్తా బేకింగ్ సోడా చల్లి పొడి గుడ్డతో తుడవడం మంచిది. అయితే, తుడిచాక కచ్చితంగా సోఫాను ఆరబెట్టాలని గుర్తుపెట్టుకోండి. నీరు అలానే ఉంటే అది సోఫాపై లెదర్ని బలహీనంగా మారేలా చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పొడిగా ఉండేలా క్లీన్గా తుడవడం మంచిది.

Also Read : Food Poisoning : ఫ్రిజ్లో ఏ ఆహారాన్ని ఎన్ని రోజులు పెట్టొచ్చు

నేరుగా వద్దు..

కొన్ని క్లీనింగ్ లిక్విడ్స్.. క్లీనర్, కండీషనర్ రెండింటిని కలిగి ఉంటాయి. ఇలాంటి లిక్విడ్ని డైరెక్ట్గా సోఫాపై వేయకుండా ముందుగా క్లాత్పై వేసి క్లీన్ చేయడం మంచిది. నేరుగా సోఫాపై వేస్తే మరకలు పడే చాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మరువొద్దు. అదే విధంగా తుడిచాక వెంటనే మరోసారి గుడ్డతో మొత్తంగా తుడిస్తే సరిగ్గా క్లీన్ అవుతాయి.

ఫర్నీచర్ పాలిష్.. ఇది మార్కెట్లో దొరుకుతుంది. దీంతో నెలకి ఓ సారైనా సరే లెదర్ వస్తువులని క్లీన్ చేయడం మంచిది. దాంతో దానిపై ఉన్న మరకల్నీ పోయి చక్కగా మెరుస్తాయి. వీటిని క్లీన్ చేశాక నీడలోనో లేదా ఫ్యాన్ కింద ఆరేలా ఉంచండి.

కండీషనర్..

సోఫాపై కండీషన్ వాడాలనుకున్నప్పుడు ముందుగా సోఫాను కచ్చితంగా క్లీన్ చేయాలి. ఇప్పుడు కండీషనర్ని స్ప్రే బాటిల్లో వేసి గుడ్డపై స్ప్రే చేయండి. ఆ తర్వాత సోఫాపై రుద్దండి. ఇక మార్కెట్లో చాలా కండీషనర్స్ ఉన్నాయి. మంచిది ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ కండీషనర్ సోఫా తాజాగా, తేమ, ఆయిలీ లుక్లో కనిపించేలా చేస్తుంది. ఇలా క్లీన్ చేశాక వాటిని కచ్చితంగా గంటసేపైనా ఆరేలా చూడండి. దీంతో కూర్చున్నప్పుడు ఆ లిక్విడ్ మీ బట్టల్లో చొరబడకుండా ఉంటుంది.
Also Read : Pregnancy Romance : ప్రెగ్నెన్సీ టైమ్లో ఇలా అనిపిస్తే శృంగారం చేయొద్దొట..

ఇవి వద్దు..

సాధారణంగా లెదర్ ఏదైనా ఒకటే కదా అని షూ పాలిష్ రాయడం, ఆల్కహాల్ బేస్డ్వి రాయడం చేయొద్దు. ఇవి మీ లెదర్ సోఫాలకు అస్సలు మంచిది కాదు. వాటి మెరుపుని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి, ఈ విషయాన్ని మరువొద్దు. ఏ వస్తువులకి వేటిని వాడాలో వాటిపై రాసి ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకోవడం, వాటిని ఫాలో అవ్వడం మంచిది. ఇలా మెంటెయిన్ చేస్తుంటే మీ ఫర్నీచర్ కూడా ఎప్పుడు కొత్తవాటిలానే అందంగా మెరుస్తుంటాయి.

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.